ghmc Election results 2020: అడగకుండానే వరద సాయం.. పన్నులు తీసేసినా పట్టించుకోని జనం.. గ్రేటర్‌లో కారు జోరు తగ్గిందేలా..?

గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నంత స్థాయిలో టీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. అంచనాలు తలకిందులు అయ్యాయి. దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా లో ఉండదు అనుకున్న గులాబీ దళానికి వరుస ఫలితాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలేం జరిగింది..భవిష్యత్ లో ఎం జరగబోతుంది ఇదే ఇప్పుడు గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది.

ghmc Election results 2020: అడగకుండానే వరద సాయం.. పన్నులు తీసేసినా పట్టించుకోని జనం.. గ్రేటర్‌లో కారు జోరు తగ్గిందేలా..?
Follow us

|

Updated on: Dec 05, 2020 | 7:40 AM

గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నంత స్థాయిలో టీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. అంచనాలు తలకిందులు అయ్యాయి. దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా లో ఉండదు అనుకున్న గులాబీ దళానికి వరుస ఫలితాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలేం జరిగింది..భవిష్యత్ లో ఎం జరగబోతుంది ఇదే ఇప్పుడు గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపదు అనుకున్న టీఆర్ఎస్‌కు పరాభవం తప్పలేదు.. ఒకటి కాదు రెండు కాదు 99 స్థానాల నుండి 55 స్థానాలకు పడిపోయింది. టిఆర్ఎస్ ఆరేళ్ల పాలనకు రెఫరెండంగా మారిందా అనే చర్చ పార్టీలో మొదలయింది. 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలిస్తే మోడీ హవా అనుకున్న టీఆర్ఎస్కు,అటు దుబ్బాక ఇటు బల్దియా ఫలితాలు మింగుడుపడటం లేదు. కేసీఆర్, కేటీఆర్ తో సహా హేమహేమీ నాయకులు సర్వశక్తులు ఒడ్డినా ఫలితాలు తారుమారు అవ్వడం టిఆర్ఎస్‌ను ఆలోచనలో పడేసింది.

గ్రేటర్ వాసులను రికార్డుస్థాయిలో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరవాసుల కష్టాలను చూసిన రాష్ట్ర సర్కార్.. అడగకున్నా వరద సహాయం చేసింది. విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఐటీ హబ్, మెట్రో, ఫ్లైఓర్లు, మాదాపూర్ బ్రిడ్జి ఇలా అనేక అభివృద్ధి పనులను చేపట్టింది కేసీఆర్ సర్కార్. అయినా మహానగర వాసులు టీఆర్ఎస్ అదరించలేదు. మరోవైపు, ఇటీవల రాష్ట్ర సర్కార్ ఎల్ఆర్ఎస్ పథకం అధికార పార్టీ కొంప ముంచిందా… ఇలా అనేక ప్రశ్నలు అధికార పార్టీ పెద్దల మైండ్ లను తొలుస్తున్నాయి.. ముఖ్యంగా టీఆర్ఎస్‌కు ఎంఐఎం కు బీజేపీ లింకులు పెట్టడం, సర్జికల్ స్ట్రైక్ లాంటి బీజేపీ ఘాటు వ్యాఖ్యలు తమకే కలిసి వస్తాయి అనుకున్న టీఆర్ఎస్‌కు పెద్ద సంఖ్యలో సిట్టింగ్ కార్పొరేటర్లు సైతం ఓటమి పాలయ్యారు.

రాష్ట్రంలో బిజెపి వేవ్ మొదలయిందా ఇది భవిష్యత్ లో ఎటు దారి తీస్తుంది…ఇప్పుడు టిఆర్ ఎస్ ముందు ఉన్న దిద్ధిబాటు చర్యలు ఏంటి అన్నది ఆ పార్టీ వెతుకులదుతుంది…గ్రేటర్ ఎన్నికల్లో ఉచిత మంచి నీరు,కొన్ని వర్గాలకు ఉచిత విద్యుత్, కమర్షియల్ ట్యాక్స్,ఇంటి పన్నులో సగం రాయితీలు ఇచ్చినా ప్రజలు కారుపై చూసేందుకు ఇష్టపడలేదని కనిపిస్తుంది.

ఒకటి కాదు రెండు కాదు ఒక వైపు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి చెప్తూనే అనేక కొత్త హామీలు ఇచ్చిన టిఆర్ ఎస్ కు ఎల్బీనగర్, ముషీరాబాద్, ఉప్పల్ లాంటి ఏరియాల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది… ఇప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది పార్టీ వర్గాల టాక్….ఇలా కొన్ని సెగ్మెంట్ లలో టిఆర్ ఎస్ ఎక్కువ సీట్లు కోల్పోయింది… మొత్తానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎలాగో అలా సెట్ చేసుకోవచ్చు కానీ రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ ముందు ఉన్న పెద్ద సవాళ్లు. మరి బల్దియా ఫలితాలపై టీఆర్ఎస్ పోస్ట్ మార్టం ఏవిధంగా ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది.