AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

లోన్ అప్లై చేసే ముందు ఇది చెక్ చేశారా.. ఈఎంఐ కాలిక్యులేటర్‌తో నెలవారీ ఖర్చులపై పక్కా లెక్క..

లోన్ తీసుకునే ముందు చాలామంది చేసే పొరపాటు.. నెలకు ఎంత కట్టాలో ముందే అంచనా వేసుకోకపోవడం. చివరికి అది నెలవారీ ఇంటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి సమస్యలు రాకుండా మన తిరిగి చెల్లించే సామర్థ్యానికి సరిపోయే సరైన రుణ మొత్తం, కాలవ్యవధిని ఎంచుకోవడంలో పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎలా ఒక స్మార్ట్ ప్లానర్‌గా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

లోన్ అప్లై చేసే ముందు ఇది చెక్ చేశారా.. ఈఎంఐ కాలిక్యులేటర్‌తో నెలవారీ ఖర్చులపై పక్కా లెక్క..
Personal Loan Emi Calculator
Krishna S
|

Updated on: Sep 09, 2026 | 4:22 PM

Share

ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీరు లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే మీ ఈఎంఐ చెల్లింపును అంచనా వేయడంలో ఎంతో సహాయపడుతుంది. రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే టైమ్‌ను ఎంటర్ చేయగానే అంచనా వేసిన ఈఎంఐని వెంటనే చూడొచ్చు. అది మీ నెలవారీ బడ్జెట్‌లో ఎలా సరిపోతుంది అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కింపు మీ ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి, తిరిగి చెల్లింపు ఆప్షన్స్ పోల్చి చూడటానికి, ఎంత రుణం తీసుకుంటే బాగుంటుంది అని నిర్ణయించుకోవడానికి తోడ్పడుతుంది. మీరు ఒక పెళ్లి, ఇంటి పునరుద్ధరణ పనులు ప్లాన్ చేస్తున్నా లేదా అనుకోని వైద్య ఖర్చులు ఎదురైనా.. ముందుగానే ఈఎంఐ ఎంత ఉంటుందో తెలుసుకుంటే ఆర్థిక ప్రణాళిక చాలా సులభతరం అవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది..?

ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీరు పర్సనల్ లోన్ తీసుకునే ముందే మీ నెలవారీ వ్యయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీని ద్వారా

  • రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలవ్యవధి ఆధారంగా ఈఎంఐని అంచనా వేయవచ్చు.
  • వివిధ రుణ మొత్తాలను, తిరిగి చెల్లించే టైమ్‌ను పోల్చి చూడవచ్చు.
  • అంచనా వేసిన ఈఎంఐ మీ ప్రస్తుత నెలవారీ బడ్జెట్‌లో సరిపోతుందో లేదో లెక్కించవచ్చు.
  • వైద్య అవసరాలు, విద్య, పెళ్లిళ్లు, ప్రయాణాలు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి ఖర్చుల కొరకు స్పష్టమైన ప్రణాళిక చేసుకోవచ్చు.
  • మీ తిరిగి చెల్లింపు సామర్థ్యం ఆధారంగా సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు.

దరఖాస్తు చేసే ముందు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల రుణ ప్రణాళిక సులభతరం అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితికి తగిన తిరిగి చెల్లింపు ఎంపికను ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు మీరు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాను అంచనా వేసే ఒక ఆన్‌లైన్ సాధనం. ఇది ఈఎంఐని లెక్కించడానికి మూడు ప్రధాన వివరాలను ఉపయోగిస్తుంది.

  • రుణ మొత్తం: మీరు తీసుకోవాలనుకుంటున్న అసలు మొత్తం.
  • వడ్డీ రేటు: రుణంపై వర్తించే వార్షిక వడ్డీ రేటు.
  • తిరిగి చెల్లింపు కాలవ్యవధి: రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎంచుకున్న సమయం.

ఈ వివరాలను ఎంటర్ చేసిన వెంటనే కాలిక్యులేటర్ అంచనా వేసినన ఈఎంఐని చూపిస్తుంది. వివిధ సందర్భాలను పోల్చి చూడటానికి మీరు రుణ మొత్తాన్ని లేదా కాలవ్యవధిని మార్చి సరిచూసుకోవచ్చు.

ఉదాహరణకు.. మీకు రూ. 3 లక్షలు అవసరం అనుకుందాం. ఈ మొత్తాన్ని కాలిక్యులేటర్‌లో నమోదు చేసి, వేర్వేరు కాలవ్యవధులకు ఎంత ఈఎంఐ వస్తుందో పోల్చి చూడవచ్చు. ఈ తిరిగి చెల్లింపు మీ నెలవారీ క్యాష్‌ఫ్లోపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ బడ్జెటింగ్‌లో ఎలా సహాయపడుతుంది?

నెలవారీ బడ్జెట్‌లో సాధారణ ఖర్చులతో పాటు కొత్తగా చేరే ఆర్థిక బాధ్యతలను కూడా చేర్చాల్సి ఉంటుంది. లోన్ తీసుకునే ముందే తిరిగి చెల్లింపు భారాన్ని బేరీజు వేసుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది.

నెలవారీ చెల్లింపు అంచనా: ప్రతి నెలా లోన్ కోసం ఎంత మొత్తం పక్కన పెట్టాలో కాలిక్యులేటర్ స్పష్టత ఇస్తుంది. ఈ మొత్తాన్ని మీ రెగ్యులర్ ఖర్చులు, పొదుపులతో పోల్చి చూసి బడ్జెట్‌కు సరిపోతుందో లేదో తెలుసుకోవచ్చు.

కాలవ్యవధుల పోలిక: దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. స్వల్పకాలిక వ్యవధి అయితే ఈఎంఐ పెరిగినప్పటికీ లోన్ త్వరగా తీరిపోతుంది. మీకు అనుకూలమైన వ్యవధిని ఎంచుకోవడానికి ఈ పోలిక ఉపయోగపడుతుంది.

తగిన రుణ మొత్తం ఎంపిక: అవసరానికి మించి అప్పు తీసుకుంటే నెలవారీ ఆర్థిక భారం పెరుగుతుంది. వేర్వేరు మొత్తాలను నమోదు చేసి చూడటం ద్వారా మీ చెల్లింపు సామర్థ్యానికి తగిన రుణాన్ని మాత్రమే ఎంచుకోవచ్చు.

క్యాష్‌ఫ్లో ప్రణాళిక: ఇంటి ఖర్చులు, అద్దె, బిల్లులు, పొదుపుల కేటాయింపులు పోను మిగిలే ఆదాయంతో కొత్త ఈఎంఐని ఎలా సర్దుబాటు చేయాలో స్పష్టమైన అవగాహన వస్తుంది.

పర్సనల్ లోన్ ఎప్పుడు ఖర్చులను నిర్వహించుటలో సహాయపడుతుంది?

అర్హత ప్రమాణాలు, రుణ నియమాలకు లోబడి క్రింది ఖర్చుల నిర్వహణకు పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది:

  • అత్యవసర వైద్య ఖర్చులు
  • ఉన్నత విద్యా ఖర్చులు
  • వివాహ వేడుకలు
  • ఇంటి పునరుద్ధరణ
  • ప్రయాణ ఖర్చులు

ఉదాహరణకు.. అనుకోని వైద్య ఖర్చులు మీ పొదుపుపై ఒత్తిడి తెచ్చినప్పుడు, ఒక పర్సనల్ లోన్ నెలవారీ వాయిదాల రూపంలో ఆ భారాన్ని తేలిక చేస్తుంది. విద్య లేదా ఇంటి మరమ్మతుల వంటి ముందస్తు పనులకు కూడా ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా సంభావ్య వ్యయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

పర్సనల్ లోన్ ఒక సౌకర్యవంతమైన ఎంపిక ఎందుకు?

పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్. దీనిని వివిధ వ్యక్తిగత అవసరాల కోసం స్వేచ్ఛగా వాడుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు.. 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే కాలవ్యవధులతో అందిస్తుంది. వడ్డీ రేట్లు రుణ నిబంధనల ఆధారంగా ఏడాదికి 10% నుండి 30శాతం వరకు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు, నామమాత్రపు డాక్యుమెంటేషన్, అర్హతలకు లోబడి వెంటనే ఆమోదం, 24 గంటల్లో నిధులు ఇవ్వడం వంటివి అందుబాటులో ఉంటాయి.

ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

  • మీరు తీసుకోవాలనుకుంటున్న రుణ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  •  వర్తించే వడ్డీ రేటును నమోదు చేయండి.
  •  తిరిగి చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోండి.
  •  స్క్రీన్‌పై కనిపించే అంచనా ఈఎంఐని పరిశీలించండి.
  •  వివిధ ఎంపికల కోసం మొత్తాన్ని లేదా కాలవ్యవధిని మార్చి చూడండి.
  •  వచ్చే ఈఎంఐని మీ నెలవారీ ఆదాయ, వ్యయాలతో సరిపోల్చుకోండి.

రుణం తీసుకునే ముందు పరిగణించాల్సిన అంశాలు

ఈఎంఐ అంచనాతో పాటు మీ పూర్తి ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి.

  • నెలవారీ నికర ఆదాయం
  • ప్రస్తుతం నడుస్తున్న ఇతర ఈఎంఐలు, బాధ్యతలు
  • క్రమమైన ఇంటి ఖర్చులు
  • ఆశించబడే కొత్త లోన్ ఈఎంఐ
  • తిరిగి చెల్లింపు కాలవ్యవధి – వడ్డీ రేటు
  • మొత్తం చెల్లించాల్సిన తుది మొత్తం

బాధ్యతాయుతంగా రుణం తీసుకోవడం అంటే బడ్జెట్‌పై ఒత్తిడి పడకుండా సులభంగా నిర్వహించగలిగే రుణ మొత్తాన్ని, సరైన కాలాన్ని ఎంచుకోవడమే. మీ అర్హతలను, నిబంధనలను సమీక్షించిన తర్వాత అవసరాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.