Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

మహా పాలిటిక్స్‌పై.. ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాలు.. రోజుకో మలుపుతిరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఇక్కడ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి మధ్య సీఎం సీటు విషయంలో వచ్చిన విభేదాలతో.. విడిపోయారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా సీఎం పదవి దక్కించుకోవాలనుకుంటున్న శివసేన.. మిత్రపక్షమైన బీజేపీకి గుడ్‌బై చెప్పి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ రెండు పార్టీలు.. శివసేనతో జతకట్టే అంశంపై ఇంకా క్లారిటీకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య చోటుచేసుకున్న రగడపై ఆర్ఎస్సెస్ ఎంటర్ అయ్యింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య చెలరేగిన చిచ్చును ఉద్దేశిస్తూ.. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో సుదీర్ఘకాలంగా పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు.. ఏ విషయంపై గొడవకు దిగినా.. అది రెండు పార్టీలకు నష్టమేనన్నారు. స్వార్ధం అనేది మంచిది కాదన్న విషయం ప్రతిఒక్కరికీ తెలుసని.. కానీ కొద్ది మంది మాత్రమే ఆ స్వార్ధాన్ని విడనాడతారని.. అప్పుడే వాళ్లు సక్సెస్ అవుతారన్నారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పదవుల పంపకంపై ఇరువురు తగవులాడితే.. మంచిది కాదన్న ఆయన.. ఘర్షణలకు దిగితే ఇరుపార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

కాగా, రాష్ట్రంలో గడువు ముగిసేలోగా అధికారం చేపట్టేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో.. గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర హోం శాఖకు  సిఫారసు చేయడం.. ఆ తర్వాత కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.