AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter2 : ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 కోసం రాక్ స్టార్ యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

పాన్ ఇండియన్ మూవీగా విడుదలైన కేజీఎఫ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు  ఈ సినిమా పార్ట్ టూ కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే.

KGF Chapter2 : 'కేజీఎఫ్' చాప్టర్ 2 కోసం రాక్ స్టార్ యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 23, 2021 | 7:09 AM

Share

KGF Chapter2 : పాన్ ఇండియన్ మూవీగా విడుదలైన కేజీఎఫ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు  ఈ సినిమా పార్ట్ టూ కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ ఇండియన్ సినీ ప్రేమికులందరికీ సుపరిచితుడు అయిపోయాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ కి యూత్ అందరూ ఫిదా అయిపోయారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు , టీజర్ సినిమాపైనే అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రికార్డులను తిరగరాస్తుంది. ఇక కేజీఎఫ్ పార్ట్ 1 కు సుమారు 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు నిర్మాతలు.  కలెక్షన్స్ ఏకంగా 200 కోట్లపైనే వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2 కోసం ఏకంగా 140 నుంచి 160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉంటే హీరో యష్ తన రెమ్యునరేషన్ ను కూడా పెంచాసాడట. కేజీఎఫ్ పార్ట్ 1 కు యష్ 11 కోట్లు పారితోషకం తీసుకున్నాడట. ఇప్పుడు పార్ట్ టూ కి ఏకంగా 30 కోట్లు తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. పైగా లాభంలో షేర్ కూడా తీసుకుంటున్నట్లు కన్నడ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పార్ట్ 2 దాదాపు 270 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనావేస్తున్నారు ట్రేడ్ పండితులు. అందుకనే కేవలం హీరో మాత్రమే కాదు.. హీరోయిన్, దర్శకుడు, ఫస్ట్ పార్ట్ లో ప్రధాన పాత్ర పోషించిన కొందరు నటులకు కూడా చాప్టర్ 2 కోసం భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Sunil : రైతు సమస్యలపై సునీల్ కొత్త చిత్రం.. కీలక పాత్రల్లో కనిపించనున్న శ్రీకాంత్, తారక రత్న..

Follow Us
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..