Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ మాత్రం యావత్ డిజిటల్ వరల్డ్ ను షేక్ చేస్తుంది. ఇంతకీ ఈ సాంగ్ ఏంటో తెలుసుకుందామా.

Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..
Bangula Folk Song

Updated on: Sep 27, 2026 | 5:10 PM

తెలుగు సంగీత ప్రియులను ఊపేసేందుకు మరో ఫోక్ సాంగ్ వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఏ మూలన చూసినా ఈ పాట ఒకటే హడావుడి. అదేంటంటే యూట్యూబ్ షేక్ చేస్తున్న “బంగులా” (Bangula) ఫోక్ సాంగ్ . ఈ పాట రిలీజైన క్షణం నుంచే శ్రోతలను, జానపద ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట రికార్డు స్థాయి వ్యూస్‌తో విపరీతమైన ట్రెండింగ్ సృష్టిస్తోంది. జానపద పాటలకు ఒక ప్రత్యేకమైన గ్రిప్పింగ్ రిథమ్, గ్రామీణ నేపథ్యం ఉంటాయి. ఈ “బంగులా” పాటను సంగీత దర్శకుడు మదీన్ ఎస్కే తో అద్భుతమైన ట్యూన్‌తో స్వచ్ఛమైన ఫోక్ ఫ్లేవర్‌లో అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఇక ఈ పాటలో ప్రధాన ఆకర్షణ పాడిన గాయనీగాయకులు అని చెప్పాలి. ఫోక్ పాటలకు పాపులర్ అయిన ఇద్దరి వాయిస్ లు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. ప్రజాదరణ పొందిన సింగర్ మధుప్రియ తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటలోని భావాన్ని ప్రాణం పోస్తూ ఆలపించారు. ఆమెతోపాటు ఫోక్ సింగర్ నాగవ్వ వాయిస్ మరింత ఎనర్జిటిక్ జోష్ ఇచ్చింది. పాటలోని ప్రతీ లైన్, లయబద్ధమైన డప్పు దెబ్బలు నెటిజన్లను ఊపేస్తున్నాయి .

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఈ పాట విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ చార్ట్స్ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని మాస్ బిట్‌లకు వేలాది మంది నెటిజన్లు, డాన్స్ లవర్స్, రీల్ మేకర్స్ స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఏముందిరా బాబూ పాట! వింటుంటే కాళ్లు కదపకుండా ఉండలేకపోతున్నాం”, “మధుప్రియ వాయిస్ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లింది” అంటూ జానపద అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సాంగ్ మీరు విన్నారా.. ?

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

బంగుళా సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us