క్రిస్మస్ వేడుకల్లో విజయ్ దేవరకొండ.. సర్ప్రైజింగ్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలువులు సెలబ్రెటీలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్, మహేష్ బాబు,
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలువులు సెలబ్రెటీలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్, మహేష్ బాబు, సమంత, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ వాళ్ళింట్లో జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అందరికి అందించడం మన సంప్రదాయం. ప్రేమ, ఆశ్చర్యాలకు మనమందరం అర్హులం. ఈ ఏడాది మేము ఇదే చేసాం అంటూ విజయ్ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
#DeveraSanta 2020 ???
Our ritual of spreading random happiness and cheer, we all deserve love and surprises! This is what we did this year ? pic.twitter.com/Lm28w93UFH
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2020