Varun Tej Vs Vijay Devarakonda: కామన్ పాయింట్ తో పోటీపడుతున్న వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ..గని వర్సెస్ లైగర్

మెగా వారసుడుగా ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. డిఫరెంట్ సినిమాతో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రతో వెండి తెరపై అడుగు పెట్టి..ఎవడే సుబ్రహ్మణ్యం, వంటి హిట్స్ తో హీరోగా ఓ రేంజ్ లో క్రేజ్ ను..

Varun Tej Vs Vijay Devarakonda: కామన్ పాయింట్ తో పోటీపడుతున్న వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ..గని వర్సెస్ లైగర్
Follow us

|

Updated on: Jan 19, 2021 | 3:08 PM

Varun Tej Vs Vijay Devarakonda: మెగా వారసుడుగా ముకుంద సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. డిఫరెంట్ సినిమాతో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు వరుణ్ తేజ్ వరస విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో జోరు మీదున్నాడు. ఈ మెగా ప్రిన్స్ ఇటీవల నటించిన అంతరిక్షం మినహా ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ అన్ని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను సొంతంచేసుకున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రతో వెండి తెరపై అడుగు పెట్టి..ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి హిట్స్ తో హీరోగా యూత్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నసమయంలో వరస ప్లాప్ లను అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ తో చేస్తున్న సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే యంగ్ హీరోలిద్దరూ పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఒకే కామన్‌ పాయింట్‌ మీద పోటీ పడుతుండటంతో.. ఇప్పుడంతా టాలీవుడ్‌లో వరుణ్‌ తేజ్‌ వర్సెస్‌ విజయ్‌ దేవరకొండ అని అంటున్నారు.

విజయ్ దేవరకొండ తాజా సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే పూరీ-విజయ్ సినిమా వస్తుంది. ఈ కాంబినేషన్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో తన సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ వినిపించింది. కానీ చిత్రయూనిట్‌ అధికారికంగా ‘లైగర్‌’ అంటూ టైటిల్‌ను, విజయ్‌ దేవరకొండ బాక్సింగ్‌ లుక్‌ను విడుదల చేసింది. ఇక వరుణ్ తేజ్‌ 10వ చిత్రంగా రూపొందుతోన్న చిత్రం కూడా బాక్సింగ్‌ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ‘గని’ అనే టైటిల్‌ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆ విషయాన్ని రివీల్‌ చేశారు నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ ఈ సినిమాతో నిర్మాతగా అడుగు పెడుతున్నాడు. ఈ రెండు చిత్రాలు బాక్సింగ్‌ నేపథ్యంలో ఉండటంతో పాటు.. వెంటవెంటనే అప్‌డేట్స్‌ రావడంతో.. వీరిద్దరిని ఇలా వర్ణిస్తున్నారు.

Also Read: జాతీయ విపత్తు రక్షణ దళంలోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..