Varun Dhawan: బాలీవుడ్‌ స్టార్‌ హీరోకు ఉచితంగా బంగారం ఆఫర్‌ చేసిన లేడీ ఫ్యాన్‌.. అతని రిప్లై ఏంటంటే..

|

Mar 04, 2022 | 4:43 PM

స్టార్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ ధావన్‌ వారసుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు వరణ్‌ ధావన్‌ (Varun Dhawan). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బద్లాపూర్‌, ఏబీసీడీ2, జుద్వా2, దిల్‌వాలే, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ తదితర హిట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు

Varun Dhawan: బాలీవుడ్‌ స్టార్‌ హీరోకు ఉచితంగా బంగారం ఆఫర్‌ చేసిన లేడీ ఫ్యాన్‌.. అతని రిప్లై ఏంటంటే..
Varun Dhawan
Follow us on

స్టార్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ ధావన్‌ వారసుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు వరణ్‌ ధావన్‌ (Varun Dhawan). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బద్లాపూర్‌, ఏబీసీడీ2, జుద్వా2, దిల్‌వాలే, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ తదితర హిట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సోషల్‌ మీడియాలోనూ వరుణ్‌కు భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. కాగా వరుణ్ ధావన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. వరుణ్ ధావన్ ఓ పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఈవిషయం తెలుసుకున్న అభిమానులు అతని దగ్గరకు ఫోటోలు తీసుకున్నారు. వరుణ్‌ కూడా ఎంతో కూల్‌గా అడిగన వారందరికీ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చాడు. అయితే ఇంతలో ఓ లేడీ ఫ్యాన్ (Lady Fan) వచ్చి తన బంగారు ఆభరణాల దుకాణాన్ని సందర్శించవలసిందిగా వరుణ్‌ను అభ్యర్థించింది. అందుకు బదులుగా ఉచితంగా బంగారం కూడా ఇస్తానని ఆఫర్‌ ఇచ్చింది . ఆమె అలా చెప్పడంతోనే ధావన్ ఆశ్చర్యపోయాడు. బంగారం ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. దీంతో ‘బంగారాన్ని ఉచితంగా ఇవ్వను. అయితే మేకింగ్ ఛార్జీలు మాత్రం మినహాయిస్తాను’ అని ఆ అభిమాని హీరోతో చెప్పింది.

కాగా ఈ ఘటనను అంతా అక్కున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘వరుణ్‌ ధావన్‌ చాలా మంచి మనిషి’, ‘స్టార్‌ హీరో అనే గర్వం అతనికి ఏ మాత్రం లేదు’, ‘హీ ఈజ్‌ సో కూల్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్‌ చివరిగా కూలీ నం.1 సినిమాలో నటించాడు. ఆతర్వాత సల్మాన్‌ అంతిమ్‌ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం అతను భేడియా, జుగ్‌ జుగ్‌ జీయో చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read:ట్రెండ్ సెట్ చేసిన డీఎంకే.. దళిత మహిళకు చెన్నై మేయర్ పీఠం.. పిన్న వయస్కురాలిగానూ రికార్డు

Weight Loss: వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? అయితే, కారణమిదే..

జుట్టుకు నూనె రాసుకుంటున్నారా..