ట్రెండ్ సెట్ చేసిన డీఎంకే.. దళిత మహిళకు చెన్నై మేయర్ పీఠం.. పిన్న వయస్కురాలిగానూ రికార్డు

తమిళ రాజకీయాలలో డీఎంకే(DMK) ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకుంది. ఈ మేరకు డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్. ప్రియ(R.Priya as Chennai Mayor) చెన్నై మేయర్‌గా..

ట్రెండ్ సెట్ చేసిన డీఎంకే.. దళిత మహిళకు చెన్నై మేయర్ పీఠం.. పిన్న వయస్కురాలిగానూ రికార్డు
Chennai Mayor
Follow us

|

Updated on: Mar 04, 2022 | 3:39 PM

తమిళ రాజకీయాలలో డీఎంకే(DMK) ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకుంది. ఈ మేరకు డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్. ప్రియ(R.Priya as Chennai Mayor) చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో ఇటీవల ముగిసిన పట్టణ సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చెన్నై మేయర్ స్థాన్నాన్ని షెడ్యూల్డ్ కులాల మహిళకు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన ప్రియ.. ఈ పీఠాన్ని అలంకరించిన తొలి దళిత వ్యక్తిగానే కాకుండా అతి పిన్న వయస్కురాలిగానూ, మూడో మహిళగానూ రికార్డు సృష్టించారు. నార్త్‌ చెన్నూరులోని తిరువికా నగర్‌కు చెందిన ప్రియ.. 74వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (GCC)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. చెన్నైకి గతంలో తారా చెరియన్‌, కామాక్షి జయరామన్‌లు మహిళా మేయర్లుగా పనిచేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన ప్రియ ఈ కోవలో మూడో మహిళగా నిలిచారు. ప్రియ తాత చెంగయ్య శివం గతంలో డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి ఆర్‌.రాజన్‌ ఈ ప్రాంతానికి పార్టీ సహ కార్యదర్శిగా ఉన్నారు.

ఇప్పటివరకు చెన్నై మేయర్ గా ఉన్న మహిళలలో తారా చెరియన్, కామాక్షి జయరామన్ తర్వాత ఈ పీఠాన్ని అధిష్ఠించిన మూడో మహిళ ప్రియ కావడం విశేషం. ప్రియా 74వ వార్డు, మంగళపురం కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాదు ప్రియ ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్ గా కూడా రికార్డ్ సృష్టించారు. ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని.. రౌడీయిజం, హింస ఎక్కువగా ఉన్న ప్రదేశంగా చాలా తరచుగా తమిళ సినిమాల్లో చిత్రీకరిస్తారు. వాస్తవానికి ఈ మంగళాపురం ఉత్తర చెన్నై పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ ప్రాథమిక మౌలిక సదుపాయాలకు చాలా దూరంగా ఉంటుంది. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అనేక సమస్యలతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యువ కౌన్సిలర్‌ను మేయర్‌గా నియమించడం స్వాగతించదగినదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

Russia Ukraine War: యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?

LIC IPO Alert: ఎల్ఐసీ ఐపీవో వాయిదా.. మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. ప్రభుత్వ వర్గాల మాటేంటి..

Market Update: వారాంతంలోనూ వదలని వార్ భయాలు.. దలాల్ స్ట్రీట్‌‌‌‌‌‌లో బేర్ల జోరు.. భారీగా మార్కెట్ల పతనం..