AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vrushakarma: వృషకర్మ కోసం స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్.. మరో హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకోసం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో నాగచైతన్య మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్

Vrushakarma: వృషకర్మ కోసం స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్.. మరో హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్
Vrushakarma
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2026 | 3:26 PM

Share

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు డిఫరెంట్ విజన్‌తో పాటు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ క్రియేటివ్ ఫోర్సెస్ ‘వృషకర్మ’ కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే సినిమా స్ట్రైకింగ్ గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు విడుదలై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. ఈ వీడియోలు సినిమా యూనిక్ వరల్డ్, స్కేల్, విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన లుక్ ను అందించాయి.

వైవిధ్యమైన, ఛాలెంజింగ్ సబ్జెక్టుల తో వస్తున్న నాగచైతన్య ‘వృషకర్మ’లో డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయన మ్యాసీవ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు. ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌లో స్పర్శ్ శ్రీవాస్తవ తన స్ట్రైకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రిలీజ్ డేట్ అధికారికంగా లాక్ కావడంతో మేకర్స్ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ అగ్రెసివ్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ‘వృషకర్మ’ కోసం స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తూ సినిమా కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని రూపొందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?
మే లో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది? UPSC ప్రశ్న
మే లో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది? UPSC ప్రశ్న
తప్పుడు కేసుకు ప్లాన్.. కానీ వైరల్ వీడియోతో పోలీసులకు షాక్ !
తప్పుడు కేసుకు ప్లాన్.. కానీ వైరల్ వీడియోతో పోలీసులకు షాక్ !
ఎకరా జామ తోట సాగుతో లక్షల్లో ఆదాయం..!
ఎకరా జామ తోట సాగుతో లక్షల్లో ఆదాయం..!