అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే.. సీన్ మారిపోయింది.. యూట్యూబర్ నందన సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ యూట్యూబర్ నందన కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఉద్యోగాలు, వీసాల రెన్యూవల్ పేరుతో మోసాలకు పాల్పడ్డారనే కేసులో మొన్నామధ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు రమానందన. ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు.. ఈ కేసులో కీలకంగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరిది, దాని ఓనర్ ఎవరు అనే కీలక ప్రశ్నలు అడిగారు

అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే.. సీన్ మారిపోయింది.. యూట్యూబర్ నందన సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్
Youtuber Nandana

Updated on: Sep 30, 2026 | 8:47 AM

సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ రమా నందన పేరు గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమెను హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత నందనకు సంబంధించిన ప్రతి సోషల్ మీడియా పోస్ట్‌పై ఆసక్తి పెరిగింది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. నందన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేస్తూ.. దానికి ఓ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది. సెప్టెంబర్ 7న గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే తన జీవితంలో ఒక కఠినమైన పరిస్థితి ఎదురైందని గుర్తు చేసుకుంది నందన. ప్రస్తుతం ఎదుర్కొంటున్న న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో, ఆమె పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నందన తన తాజా పోస్టులో కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. తనకు ఎదురైన పరిస్థితిని వ్యక్తిగత అనుభూతిగా మాత్రమే పంచుకుంది.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

నందన, ఆమె భర్త మధుకర్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారని కొందరు ఫిర్యాదు చేశాడు. ఓ బాధితుడు నందన చేతిలో మోసపోయి.. సుమారు రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆరోపించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నేపథ్యంలో నందనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 7న ఆమె హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్‌ఔట్ నోటీసుల ఆధారంగా గుర్తించి నందనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల నోటీసుల మేరకు నందన విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ‘డెస్టినీ కన్సల్టెన్సీ’కి సంబంధించిన వ్యవహారాలపై పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

తనకు ఆ కన్సల్టెన్సీ వ్యవహారాలతో సంబంధం లేదని, దాన్ని తన భర్త మధుకర్ చూసుకుంటారని నందన విచారణలో చెప్పినట్లు వార్తలొచ్చాయి.ఇదిలా ఉంటే.. తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను నందన గతంలోనే ఖండించారు. తమపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని, సంబంధిత కన్సల్టెన్సీ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆమె వాదించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తూ నందన, ఆమె భర్త హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది.

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us