Mishan Impossible: తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ నుంచి క్రేజీ సాంగ్.. ఆకట్టుకుంటున్న పాట..

టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను మాత్రమే తీయడానికి పరిమితం కాదు. ఎందుకంటే చిన్న త‌ర‌హా నుంచి మీడియం రేంజ్ బడ్జెట్‌లలో కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా చేస్తున్నారు.

Mishan Impossible: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ మూవీ నుంచి క్రేజీ సాంగ్.. ఆకట్టుకుంటున్న పాట..
Mishan Impossible , Tapsee

Updated on: Feb 24, 2022 | 5:14 PM

Mishan Impossible: టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను మాత్రమే తీయడానికి పరిమితం కాదు. ఎందుకంటే చిన్న త‌ర‌హా నుంచి మీడియం రేంజ్ బడ్జెట్‌లలో కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా చేస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం 8 గా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జె నేతృత్వం వ‌హిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి మేకర్స్ మొదటి పాటను విడుదల చేశారు. `ఎద్దాం గాలం` అనే పాట విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. మార్క్ కె రాబిన్ హసిత్ గోలీ రాసిన కొన్ని ఫన్నీ లైన్లతో ఈ పాట ట్రాక్‌ను కంపోజ్ చేశారు. స్టార్ సింగర్స్ శ్రీరామ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్ మరియు హేమ చంద్ర గానం ఈ పాటకు అదనపు ఆకర్షణ.

నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎన్ ఎం పాషా అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దీపక్ యెరగరా అందిస్తుండగా.. సంగీతం మార్క్ కె రాబిన్ అందిస్తున్నారు.. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాప్సీ పన్ను తెలుగులో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం హిందీతోపాటు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Nithya Menon: నిత్యయవ్వన మకరందం ‘నిత్యామీనన్’.. బూరె బుగ్గల చిన్నదాని నయా ఫొటోస్ అదుర్స్..

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

Follow Us