
కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని ప్రకారం, ఇది ఒక పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని తెలిసింది. ఈ సినిమాను యుఏఈలో పంపిణీ చేసిన ‘ఫార్స్ ఫిల్మ్స్’ తమ వెబ్‌సైట్‌లో ఈ మూవీ కథ గురించి కొంత సమాచారం ఇచ్చింది.
వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ‘1940 – 70 మధ్య గోవా బ్యాక్ డ్రాప్‌లో సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. అందమైన సముద్ర తీరం వెనుక దాగి ఉన్న చీకటి ప్రపంచం, రక్తపాతం, నేర సిండికేట్లు, వెన్నుపోట్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇంతటి నేర సామ్రాజ్యంలో ఓ సామాన్యుడు భయం, ద్రోహంతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడో అనేదే టాక్సిక్ సినిమా కథ. అండర్ వరల్డ్ సామ్రాజ్య అధికారం కోసం యశ్ తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఏదైనా పని పూర్తి చేయడానికి తనపై తప్ప వేరే ఎవరిపై ఆధారపడని అతను ఎలా పవర్ ఫుల్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు’ అన్నదే టాక్సిక్ మూవీ స్టోరీ లైన్ అని తెలుస్తోంది.
గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన టాక్సిక్ చిత్రాన్ని ‘కెవిఎన్ ప్రొడక్షన్స్, ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ్, యష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ ఒకేసారి కన్నడతో పాటు ఇంగ్లిష్ లోనూ తెరకెక్కడం విశేషం. ఈ మూవీ ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ‘టాక్సిక్’ మార్చి 19న విడుదల కానుంది. ఆసక్తికరంగా, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ కూడా అదే తేదీన విడుదల కానుంది. కాబట్టి, రెండు పెద్ద చిత్రాల పోటీతో బాక్సాఫీస్ క్లాష్ గట్టిగానే ఉండనుంది.
Get ready for the Carnage 🌋
9:35 AM | Tomorrow#ToxicTeaser#Toxic In Cinemas Worldwide from 19-03-2026@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere… pic.twitter.com/RHaLTeXpih— KVN Productions (@KvnProductions) February 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.