AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరెరె.. ఈ పాటలో చిరు పక్కన డ్యాన్స్ చేసిన అమ్మాయి తనా..? మీరు గుర్తుపట్టారా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విజువల్ ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ నుంచి విడుదలైన భక్తిగీతం ‘రామ రామ’… ఆధ్యాత్మికతతో పాటు ఒక ఆసక్తికరమైన చర్చకూ దారి తీసింది. చిరుతో కలిసి స్టెప్పులేసిన ఓ యంగ్ బ్యూటీ ఎవరని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. తక్కువ సినిమాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై మెగాస్టార్ పక్కన కనిపించింది.

Tollywood: అరెరె.. ఈ పాటలో చిరు పక్కన డ్యాన్స్ చేసిన అమ్మాయి తనా..? మీరు గుర్తుపట్టారా..?
Chiranjeevi Dance
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2025 | 3:21 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బింబిసార’ వంటి సెన్సేషనల్ హిట్‌ని అందించిన విశిష్ట ఈ సినిమాకు మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఇది సామాన్య కథ కాదు… సోహియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందుతోన్న భారీ విజువల్ వండర్. విడదలయిన ఈ మూవీ పోస్టర్లు, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఇక సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఐదుగురు కథానాయికలు కనిపించబోతున్నారనే గుసగుసలు హీట్ క్రియేట్ చేస్తున్నాయి. వారిలో త్రిష మెయిన్ లీడ్ గా నటిస్తుండగా… మిగతావారి వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. హనుమాన్ జయంతిని సమయంలో చిత్రబృందం ఓ పాటను రిలీజ్ చేసింది. ‘రామ రామ’ అంటూ సాగిన ఈ భక్తి గీతాన్ని అందరి ముందు ఉంచారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సంగీత మాంత్రికుడు ఎంఎం కీరవాణి ట్యూన్ బాగొట్టి వదిలాడు.

పాటను చూసిన వారు ఓ విషయం మీద మాత్రం చర్చ మొదలుపెట్టారు. మెగాస్టార్ పక్కన స్టెప్పులేస్తున్న ఆ యంగ్ బ్యూటీ ఎవరు? పాటలో చిరుకు చెల్లెలిగా కనిపించిన ఆ అందాల తార ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె ఇంకెవరో కాదు… హుషారు సినిమా ద్వారా ఫేమస్ అయిన రమ్య పసుపులేటి.అందం, అభినయంతో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ చిన్నది, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అనే చిత్రంలో కథానాయికగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే చాన్స్ పట్టేసింది. ‘విశ్వంభర’ సినిమాలో రమ్య చిరంజీవి చెల్లెలుగా కనిపించబోతుందనే టాక్ ఫిలింనగర్‌లో జోరుగా వినిపిస్తోంది. ఇక ఇటీవల విడుదలైన సాంగ్‌లో మెగాస్టార్‌తో కలిసి డాన్స్ చేసిన ఈ బ్యూటీపై… ఇండస్ట్రీలో క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..