Ramayana: ఆ రాష్ట్రంలో ‘రామాయణ’ సినిమాకు పన్ను మినహాయింపు.. స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి

రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పుడీ సినిమాకు ఒక రాష్ట్రంలో పన్ను మినహాయింపు లభించింది. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది.

Ramayana: ఆ రాష్ట్రంలో రామాయణ సినిమాకు పన్ను మినహాయింపు.. స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి
Ramayanam

Updated on: Oct 21, 2026 | 5:44 PM

బాలీవుడ్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించింది . విజయదశమి (దసరా) పవిత్రమైన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విజయదశమి రోజున ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇలా అన్నారు, ‘రామాయణ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నాం. గతంలో ‘ది కేరళ స్టోరీ’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లే, ఇది రామాయణ చిత్రానికి కూడా వర్తిస్తుంది. రాబోయే రోజుల్లో, శ్రీకృష్ణుడు, అర్జునుడు, మహాభారతానికి సంబంధించిన మరిన్ని పౌరాణిక చిత్రాలను మనం చూడబోతున్నాం’ అని సువేందు చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా, కోల్‌కతాలోని చోర్‌బాగన్ ప్రాంతంలోని దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన విషాద సంఘటనపై ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితుల కుటుంబాలకు నివాళులర్పించారు. అలాగే ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.

సుమారు 4,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఇతిహాసం ‘రామాయణం’లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్, లక్ష్మణుడిగా రవి దూబే, మరియు హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరే కాకుండా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, శోభన, షీబా చద్దా, ఫైసల్ మాలిక్ వంటి స్టార్స్ కూడా వివిధ పాత్రలు పోషిస్తున్నారు. రామయాణం చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డిఎన్‌ఇజి’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. . ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మీడియాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us