
తమిళనాడు ముఖ్యమంత్రి, సి. జోసెఫ్ విజయ్ తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఒక్కొక్క అడుగు వేస్తోన్న ఆయన ఇకపై రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు మొదటి వారం 5 షోలను ప్రదర్శించుకోడానికి అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యజమానుల నిర్ణయం మేరకు అదనపు షోలను ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సినిమా ఇండస్ట్రీకి మంచి చేకూర్చేలా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కోలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు విజయ్ కు ధన్యవాదాలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్షన్ హీరో విశాల్ కూడా విజయ్ కు థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టాడు.
‘మన ప్రియమైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి ధన్యవాదాలు. ఆయన సామాన్యుల ఆరాధ్య నాయకుడు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అత్యంత ప్రభావవంతమైన నటుడు. చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుని, కొత్త చిత్రాలు విడుదలైన మొదటి 7 రోజులు రోజుకు 5 ప్రదర్శనలకు అనుమతించినందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మా యావత్ సినీ పరిశ్రమ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం’ అని ట్వీట్ చేశాడు విశాల్.
కాగా ప్రతి సినిమాకు డైలీ ‘5 షోలు’ విషయమై ముఖ్యమంత్రి విజయ్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో, ‘సినీ పరిశ్రమ ఏప్రిల్ 16న తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిసి వివిధ డిమాండ్లను సమర్పించింది. వాటిలో, తమిళనాడు వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో అన్ని సినిమాలను రోజుకు ఐదుసార్లు ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని వారు అభ్యర్థించారు. చిత్ర పరిశ్రమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, త ముఖ్యమంత్రి ‘తమిళనాడు సినిమా థియేటర్ల (నియంత్రణ) నిబంధనలను’ సవరించారు. దీని ప్రకారం, కొత్తగా విడుదలైన తమిళ చిత్రాలను విడుదలైన తేదీ నుంచి ఏడు రోజుల పాటు తమిళనాడులోని అన్ని సినిమా హాళ్లలో ప్రతిరోజూ ఐదు ప్రదర్శనలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. దీనితో పాటు, స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లో కూడా ప్రతిరోజూ ఐదు ప్రదర్శనలు ప్రదర్శించడానికి అనుమతులు జారీ చేశారు’ అని ఆ ప్రకటనలో ఉంది.
Thank you dear @CMOTamilnadu #Vijay avargale, darling of the masses and the most prolific actor turned politician for understanding the current situation in the film industry and implementing five shows a day for all films for the first 7 days of the film s theatrical release.…
— Vishal (@VishalKOfficial) May 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.