Enemy : ఘనంగా విశాల్- ఆర్య యాక్షన్ ఎంటర్టైనర్ “ఎనిమి” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..

|

Oct 31, 2021 | 7:40 PM

తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి. యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్.

Enemy : ఘనంగా విశాల్- ఆర్య యాక్షన్ ఎంటర్టైనర్ ఎనిమి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..
Enemy
Follow us on

Enemy : తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి. యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. హిట్లు- ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఈక్రమంలోనే ఇప్పుడు ఎనిమి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘వాడు వీడు’ అనే సినిమా చేశారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా ఎనిమి ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవోటల్ లో జరుగుతున్న ఈ స్ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: జోరు పెంచిన మాస్ మహారాజ్.. తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన రవితేజ..

Puneeth Rajkumar: 13 ఏళ్ళ తర్వాత డీపీ మార్చిన హీరో.. ప్రాణ స్నేహితుడికి ఇంతకన్నా నివాళి ఉంటుందా.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు..