AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viraatapalem: ఓటీటీలో దూసుకుపోతున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ విరాటపాలెం

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చిన రెండు,మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. కృష్ణ పోలూరు తెరకెక్కించిన విరాట పాలెం వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

Viraatapalem: ఓటీటీలో దూసుకుపోతున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ విరాటపాలెం
Viraatapalem
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2025 | 4:44 PM

Share

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చిన రెండు,మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ భారీ విజయం తరువాత జీ5 సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భైరవం’ త్వరలోనే జీ5లోకి రాబోతోందని ప్రకటించారు.

ప్రస్తుతం జీ5 లో ‘విరాటపాలెం’ సిరీస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కెవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రముఖ పాత్రలు పోషించారు. 1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. అదొక శాపం అని గ్రామస్థులు భయంతో వణికిపోతుంటారు. అలా దాదాపు ఓ పదేళ్ల పాటుగా గ్రామంలో వివాహాం అనేది జరగదు.

భయం, మూఢనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఆ ఊర్లోకి పోలీసు కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. శాపగ్రస్తమైన గ్రామంలోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తుంది. ఆ ఊరి రహస్యాల్ని ఎలా తెలుసుకుంది? అది శాపమా? ఎవరైనా చేస్తున్న హత్యలా? అనే ఉత్కంఠ, థ్రిల్స్ కలిగించే అంశాలతో సిరీస్ సాగుతుంది.

జూన్ 26న ప్రీమియర్ అయిన విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ ప్రశంసలు అందుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్, నాణ్యమైన షోలను అందించే జీ5 నిబద్ధతను చాటడంలో ఈ సిరీస్ ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా జీ5 లో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్