Leo Trailer: ‘లియో’ ట్రైలర్ రిలీజ్.. దళపతి అభిమానులకు లోకేశ్ యాక్షన్ ట్రీట్..

|

Oct 05, 2023 | 7:07 PM

మాస్టర్ తర్వాత లోకేశ్ డైరెక్షన్‏లో దళపతి విజయ్ నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా లియో చిత్రం ఓవర్సీస్‌లో భారీ బిజినెస్ చేస్తోంది. అలాగే అడ్వాన్స్ సేల్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే యుకె బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన త్రిష ఫస్ట్ లుక్

Leo Trailer: లియో ట్రైలర్ రిలీజ్.. దళపతి అభిమానులకు లోకేశ్ యాక్షన్ ట్రీట్..
Leo Trailer
Follow us on

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం లియో. విడుదలకు ముందే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తోంది. మాస్టర్ తర్వాత లోకేశ్ డైరెక్షన్‏లో దళపతి విజయ్ నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా లియో చిత్రం ఓవర్సీస్‌లో భారీ బిజినెస్ చేస్తోంది. అలాగే అడ్వాన్స్ సేల్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే యుకె బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలాగే గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ మూవీపై హైప్ పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత మరోసారి విజయ్ దళపతిని యాక్షన్ హీరోగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాడు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఇక అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. “ఓ సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. అప్పటికే రోడ్డు మీద అందరూ చనిపోయారు. వాడు చాలా క్రూరుడు అందరిని కాలుస్తున్నాడు. అప్పుడే ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ కిల్లర్ ను కాల్చాడు. అతను కాల్చిన గన్ నీచేతిలో.. ” అంటూ విజయ్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా ట్రైలర్ కొనసాగింది.

ఇందులో విజయ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక విజయ్ సతీమణిగా త్రిష కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం ఉంటుందని ట్రైలర్ తో హింట్ ఇచ్చేశారు. ఇక చాలా కాలం తర్వాత ఈ సినిమాతో దళపతి అభిమానులకు యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ లోకేశ్. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, అర్జున సర్జా, సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.