సినిమా ఇండస్ట్రీని ఈ మద్యకాలంలో ఓ సమస్య తెగ ఇబ్బందిపెడుతోంది. అదే లీకుల బెడద. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ఇదే సమస్య వెంటాడుతోంది. స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎదో ఒక ఫొటో లేదా వీడియో లీక్ అవుతూనే ఉంది. మేకర్స్ ఫ్యాన్స్ ను సార్ ప్రైజ్ చేద్దాం అనుకుంటే.. కానీ కొంతమంది దాన్ని చెడగొట్టడానికి ఇలా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా ఓ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోతున్నాడు విజయ్. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ;కసితో పని చేస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైనప్ చేశాడు విజయ్. ఇటీవలే విజయ్ పుట్టిన రోజున ఈ సినిమాలను అనౌన్స్ చేశారు. వీటిలో జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో ఈ సినిమా 12వ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడి బీచ్ లొకేషన్ లో జరుగుతోన్న షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో విజయ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూట్ నుంచి ఫోటో లీక్ అవ్వడంతో మేకర్స్ అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ తో పాటు విజయ్ కూడా ఓ పోస్ట్ షేర్ చేశారు. “డియర్ రౌడీ ఫ్యాన్స్ .. మీ కోసం మంచి సినిమాను తీసుకురాబోతున్నాం దీనికోసం టీమ్ #VD12 కూడా చాలా కష్టపడుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాము. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ ” పోస్ట్ చేసారు. అలాగే విజయ్ కూడా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఆ లీక్ అయిన ఫొటో షేర్ చేయొద్దు ప్లీజ్.. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ రాసుకొచ్చాడు విజయ్.
We share your excitement and enthusiasm! We kindly request you to refrain from sharing any leaks.
The #VD12 OFFICIAL ANNOUNCEMENT will be coming very soon! ❤️🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts… pic.twitter.com/IiXlWHllEG
— Sithara Entertainments (@SitharaEnts) July 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.