ఆ హీరో ఓ లెజెండ్.. ఆయన లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు..! ఎలాంటి పాత్ర చెప్పిన ఇట్టే చేసేస్తాడు..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, తన చిత్ర నిర్మాణ సూత్రాలను వివరించారు. డబుల్ మీనింగ్, అసభ్యత లేకుండా కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన, స్క్రిప్ట్‌ బలమే సినిమా విజయానికి కీలకమని స్పష్టం చేశారు.

ఆ హీరో ఓ లెజెండ్.. ఆయన లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు..! ఎలాంటి పాత్ర చెప్పిన ఇట్టే చేసేస్తాడు..
Sv Krishna Reddy

Updated on: Nov 13, 2026 | 4:30 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక శైలిని, సున్నితమైన కుటుంబ కథా చిత్రాలకు పెద్దపీట వేసిన దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత విలువలు, వర్తమాన సినిమా పోకడలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం హాయిగా, భవిష్యత్ స్క్రిప్ట్‌ల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నానని ఆయన తెలిపారు. కృష్ణారెడ్డి తన కెరీర్ ఆరంభం నుంచే కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారని వివరించారు. “నేను భవిష్యత్తులో ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ వాడను. ఎక్స్పోజర్ చేయను. లేడీస్ ని అగౌరవపరిచే సన్నివేశాలు ఉండనివ్వను” అని మొదటి సినిమా నుంచే ప్రకటించినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ స్వీయ నియంత్రణ వల్లే తాను సెన్సార్ కట్ పడని దర్శకుడు అనే గుర్తింపు పొందానని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ ఆలోచన వెనుక తన తల్లిదండ్రుల పెంపకం, వాతావరణ ప్రభావం మాత్రమే ఉన్నాయని, ప్రత్యేకమైన సంఘటనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ఈ కఠిన నిబంధనల వల్లే ఎస్.వి. కృష్ణారెడ్డి చిత్రాలను కుటుంబమంతా కలిసి హాయిగా చూడగలుగుతారని ఆయన అన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎదురవుతున్న ఫ్లాప్‌ల గురించి మాట్లాడుతూ, బలమైన కథ, స్పష్టమైన స్క్రిప్ట్ లేకపోవడమే ప్రధాన కారణమని కృష్ణారెడ్డి గారు అభిప్రాయపడ్డారు. “పేపర్ మీద ఉన్నప్పుడు పావళాయే ఖర్చు. షూటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి పది రూపాయల ఖర్చు, షూటింగ్ అయిపోయిన తర్వాత కోట్ల రూపాయల ఖర్చు” అని అన్నారు. స్క్రిప్ట్ దశలోనే లోపాలను సరిదిద్దుకోవడం వల్ల ఆర్థిక నష్టాన్ని తగ్గించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. “స్క్రిప్ట్ మాత్రమే రక్షిస్తదండి. ఏదీ రక్షించదు. స్క్రిప్ట్ హీరోలను తయారు చేస్తదండి. హీరో స్క్రిప్ట్ ను తయారు చేయలేడు” అని అన్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేనిదే సినిమా ప్రారంభించకూడదని సూచించారు. దర్శకత్వం, సంగీత దర్శకత్వం, పాటల రచన, కొన్నిసార్లు నటన వంటి బహుముఖ రంగాలలో తన ప్రమేయం గురించి మాట్లాడుతూ, అది శారీరకంగా అలసిపోయే పనే అయినప్పటికీ, తుది ఫలితం మంచిగా వచ్చినప్పుడు ఆ ఆత్మ తృప్తి వెలకట్టలేనిదని అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, స్వయంగా బాధ్యత తీసుకుని పనిచేయడం తనకు అలవాటని తెలిపారు. వంటకు కావాల్సిన కూరగాయలను స్వయంగా ఎంచుకుని, కోసుకుని వండుకోవడం లాంటిదని, ఈ ప్రక్రియలో లభించే తృప్తి వేరని ఉదాహరణగా చెప్పారు.

తనతో పనిచేసిన నటీమణులలో సౌందర్య తనకు బాగా నచ్చిందని కృష్ణారెడ్డి గారు వెల్లడించారు. “ఆమె గ్లామర్‌తో సహా అన్ని రకాల పాత్రలు చేయగలిగే సామర్థ్యం ఉన్న గొప్ప నటి” అని ప్రశంసించారు. ఆమని వంటి వారు హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలిగితే, సౌందర్య మాత్రం ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగలదని అన్నారు. హీరోల విషయానికి వస్తే, సూపర్ స్టార్ కృష్ణతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉండేదని తెలిపారు. “ఆయన చాలా చైల్డిష్ మెంటాలిటీ. ప్రశ్నలు వేయకుండా నాపై పూర్తి నమ్మకంతో పనిచేసేవారు” అని కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చార్లీ చాప్లిన్ పాత్రలో కృష్ణను ఊహించలేమని, కానీ ఆయన తనపై ఉన్న నమ్మకంతో ఆ పాత్రను అద్భుతంగా చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us