Venu Swamy: వేణు స్వామి భార్యపై అసభ్యకరమైన కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన వీణా శ్రీవాణి.. వీడియో

వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి అన్ని విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా ఒక నెటిజన్ వీణా శ్రీవాణి గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.

Venu Swamy: వేణు స్వామి భార్యపై అసభ్యకరమైన కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన వీణా శ్రీవాణి.. వీడియో
Venu Swamy Wife Veena Srivani

Updated on: Oct 13, 2026 | 5:33 PM

సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ ను ఎదుర్కొనే వారిలో వేణు స్వామి కూడా ఒకరు. ఆయన ఏ విషయంపై స్పందించనా, పోస్ట్ పెట్టినా కొందరు పని గట్టుకుని మరీ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్, వీడియోస్ చేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతున్నారు వేణు స్వామి. అయితే తాజాగా ఒక నెటిజన్ వేణు స్వామి భార్య వీణాశ్రీవాణినిని కూడా ట్రోల్ చేశాడు. ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అయితే ఆమె మాత్రం సైలెంట్ గా ఉండిపోలేదు. సదరు నెటిజన్ కు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటరచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీణా శ్రీవాణి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .ఇందులో ఆమె మాట్లాడుతూ.. తాజాగా ఒక నెటిజన్ వీణా శ్రీవాణికి పంపిన మెసేజ్ తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. “మీరు ఇంకా శీలవతేనా? మీ ఆయన మీద ఒట్టు వేసి చెప్పు” అంటూ అత్యంత అసభ్యకరంగా ఆ వ్యక్తి ప్రశ్నించినట్లు ఆమె చెప్పారు. అలాంటి చీప్ మెసేజ్ చూసి తనకు కోపం వచ్చి వెంటనే ఆ యూజర్‌ను బ్లాక్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వీణా శ్రీవాణి తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. ‘అవును, నేను శీలవతిని కాదు.. నేను ఒక పర్ఫెక్ట్ మహిళను. తొమ్మిది నెలలు బిడ్డను మోసి, కనే సమయంలో సిజేరియన్ కష్టమని వైద్యులు చెబితే ఆపరేషన్ కు ఓకే చెప్పాను. ఆ సమయంలో ఐసీయూలో నా చుట్టూ ఉన్న డాక్టర్లు, కంపౌండర్లు అందరూ మగవారే. మహిళల ప్రసవాలు, ఆసుపత్రి పరిస్థితుల గురించి కూడా అవగాహన లేకుండా మాట్లాడే ఇలాంటి వెధవల వల్ల దేశానికి ఒరిగేదేమిటి? ప్రతీ మనిషి తల్లి, చెల్లి, భార్య ప్రసవ వేదనను, ఈ కఠిన పరిస్థితులను దాటుకొచ్చిన వారే. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే కొందరు మాత్రం ఇంకా ఇలాంటి పాత చింతకాయ ఆలోచనల వద్దే ఆగిపోయి సమాజాన్ని వెనక్కు లాగుతున్నారు’,

‘ నా మాటలు అందరు మగాళ్లను ఉద్దేశించినవి కాదు. కేవలం ఇలాంటి చీప్ మెసేజ్‌లు పెట్టే కొద్దిమంది పనికిమాలిన మనుషులకే వర్తిస్తాయి. మగవారంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇలాంటి వారిని సమాజంలో ఎవరూ మార్చలేరు. జీవితాంతం ఇలాగే వెధవలుగా మిగిలిపోతారు’ అని చెప్పుకొచ్చారు వీణా శ్రీవాణి. ప్రస్తుతం ఆమె రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు వేణు స్వామి భార్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ట్రోలర్లకు సరైన బుద్ది చెప్పారు మేడమ్’ అంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వేణు శ్రీవాణి వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us