Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ ట్రీట్.. అదిరిపోయిన పవర్ ఆఫ్ గని గ్లింప్స్..

|

Jan 19, 2022 | 12:14 PM

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న

Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ ట్రీట్.. అదిరిపోయిన పవర్ ఆఫ్ గని గ్లింప్స్..
Ghani
Follow us on

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో గని నుంచి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి పవర్ ఆఫ్ గని అంటూ హీరోకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. వరుణ్ సీరియస్ వెర్షన్ కట్ చేసిన ఈ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో హీరో పాత్రను పూర్తిగా ఎలివేట్ చేస్తూ చూపించారు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

Venkatesh: బాలకృష్ణ బాటలోనే వెంకటేష్.. రియాలిటీ షోకు హోస్ట్‏గా చేయనున్న వెంకీ ?

Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..