Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..

దక్షిణాది సినీ పరిశ్రమలో కథానాయికగా తెరంగేట్రం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. కానీ ఆ తర్వాతే రూటు మార్చింది. హీరోయిన్ అవకాశాలు పక్కన పెట్టి పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అటు నటిగానూ అలరించింది. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో అద్భుతమైన నటనతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె గురించి పోలీస్ కంప్లైంట్ సినిమా డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..
Varalakshmi

Updated on: Jun 11, 2026 | 10:40 AM

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ఇటీవలే దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె చుట్టూ తాజాగా ఒక వివాదం ముసురుకుంది. ఆమె ముఖ్య పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న విడుదలవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు వరలక్ష్మిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, వరలక్ష్మి శరత్‌కుమార్ తమ సినిమా ప్రమోషన్లకు అస్సలు సహకరించడం లేదని ఆరోపించారు. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, ఆమె మొహం చాటేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. “సినిమా ప్రమోషన్ కోసం కేవలం ఒక్క గంట సమయం కేటాయించమని అడుక్కున్నా ఆమె స్పందించలేదు. అంతేకాకుండా, షూటింగ్ సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించినా, డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఇలా కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లింది” అని దర్శకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా విషయంలో “కర్మ ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే దర్శకుడి ఆరోపణలు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీయడంతో, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ వివాదంపై స్పందించారు. ఆమె ఈ ఆరోపణలను చాలా సంయమనంతో ఎదుర్కొన్నారు. తాను సినిమా టీమ్ పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. “నన్ను దేనికైతే పిలిచారో, వాటన్నింటికీ నేను హాజరయ్యాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు, కాబట్టి వాటిపై పూర్తి అవగాహన లేకుండా స్పందించడం సరికాదు” అని ఆమె పేర్కొన్నారు.

అలాగే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకూడదనే ఉద్దేశంతో ఆమె ఒక పరిణతి చెందిన నిర్ణయాన్ని తీసుకున్నారు. “ఈ విషయంలో నా వైపు నాకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. కానీ, వాటిని బయట పెట్టి చిత్ర బృందంతో బహిరంగంగా వాదించడానికి లేదా వారి ఆరోపణలను ఖండించడానికి నేను సిద్ధంగా లేను” అని స్పష్టం చేస్తూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us