AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adikeshava Movie: ‘ఆదికేశవ’ ట్రైలర్‌.. మాస్ అవతార్‌లో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్

వైష్ణవ్ తేజ్, పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ యూత్ ఫుల్ చిత్రం 'ఆదికేశవ'తో రాబోతున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 20న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబి మాల్ లో జరిగిన వేడుకలో విడుదల చేశారు.

Adikeshava Movie: 'ఆదికేశవ' ట్రైలర్‌.. మాస్ అవతార్‌లో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్
Adikeshava
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2023 | 6:39 PM

Share

పంజా వైష్ణవ్ తేజ్ మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, అరంగేట్రం కోసం ‘ఉప్పెన’ వంటి విభిన్న చిత్రాన్ని ఎంచుకున్నారు. తొలి సినిమాతోనే నటుడిగా తన సత్తా నిరూపించుకోవాలని అనుకున్నారు. ఉప్పెనతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, విభిన్న జానర్‌లలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్, పూర్తి మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ యూత్ ఫుల్ చిత్రం ‘ఆదికేశవ’తో రాబోతున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’లో నటుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 20న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబి మాల్ లో జరిగిన వేడుకలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, “ట్రైలర్ కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా మీ అందరినీ మెప్పిస్తుంది” అన్నారు. అలాగే “నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది” అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ని చెప్పి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు వైష్ణవ్.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఇదొక పక్కా మాస్ సినిమా. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్ అన్నీ బాగుంటాయి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఫిల్మ్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది.” అన్నారు.

ట్రైలర్ ను బట్టి చూస్తే యువ దర్శకుడు, యువ హీరో కలిసి మంచి రొమాన్స్, కామెడీతో కూడిన అత్యంత స్టైలిష్ మరియు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఆకర్షణీయమైన కంటెంట్, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తూ, ఎప్పుడెప్పుడు థియేటర్ కి వెళ్ళి సినిమా చూద్దామా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. మేకర్స్ ముందు నుండి చెబుతున్నట్టుగానే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఆదికేశవ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్‌ పాత్ర చాలా డైనమిక్ గా కనిపిస్తుంది. యువ సంచలన నటి శ్రీలీలతో అతని కెమిస్ట్రీ ట్రైలర్‌లోనే అద్భుతంగా ఉంది. ఇద్దరు మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉన్నాయి.  ఆదికేశవ చిత్రాన్ని 2023 నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..