
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. తన అందం, అభినయంతో కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ సిమ్రాన్. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, శ్రీకాంత్, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుందీ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది సిమ్రాన్. ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తున్నారు. శబ్ధం, గుడ్ బ్యాడ్ అగ్లీ, టూరిస్ట్ ఫ్యామిలీ తదితర సినిమాల్లో సిమ్రాన్ పోషించిన పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోస్ లోనూ సందడి చేస్తోందీ అందాల తరా. ఇదిలా ఉంటే సిమ్రాన్ సినిమా జీవితం అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ అందాల తార జీవితంలో ఒక తీవ్ర విషాదం ఉంది.
సిమ్రాన్ మోనాల్, జ్యోతి అనే ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వీరు కూడా సినిమాలు చేశారు. ముఖ్యంగా మోనాల్ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఇష్టం అనే సినిమాలో నటించిన మోనాల్ తమిళ్ లో దళపతి విజయ్ తో కలిసి బద్రి రీమేక్ లో హీరోయిన్ గా చేసింది. అక్క సిమ్రాన్ లా స్టార్ హీరోయిన్ కావాలని మోనాల్ కలలు కంది. అయితే విధి ఆమెను చిన్న చూపు చూసింది. 2002 ఏప్రిల్ 14న అర్ధాంతరంగా తనువు చాలించింది మోనాల్. చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికీ మోనాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఈ ఘటన అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.
కాగా మోనాల్ బలవన్మరణానికి ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కారణమని సిమ్రాన్ సంచలన ఆరోపణలు చేసింది. అతను ప్రేమ పేరుతో తన చెల్లిని మోసం చేశాడని.. ఆ బాధ తట్టుకోలేక మోనాల్ ఆత్మహత్య చేసుకుందని పలు సందర్భాల్లో వాపోయింది సిమ్రాన్. అయితే కాలక్రమేణా ఈ కేసు నీరుగారిపోయింది. ఇప్పటికీ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే మోనాల్ చనిపోయి సుమారు 24 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమెను తల్చుకుంటూ ఉంటోంది సిమ్రాన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.