Hina Khan: క్యాన్సర్‏తో పోరాడుతున్న బుల్లితెర నటి.. కన్నుబొమ్మలు కోల్పోయిన హీనా ఖాన్..

|

Oct 15, 2024 | 7:53 AM

చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఆసుపత్రి బెడ్ మీద నుంచి ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇదివరకే కిమోథేరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఇక ఇప్పుడు తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది హీనా ఖాన్. క్యాన్సర్‌తో పోరాడుతున్న హినా ఖాన్ ఇప్పుడు హృదయ విదారక ఫోటోను పంచుకుంది. తన కంటిలో మిగిలి ఉన్న చివరి కనురెప్పల చిత్రాన్ని పంచుకుంది హినా ఖాన్.

Hina Khan: క్యాన్సర్‏తో పోరాడుతున్న బుల్లితెర నటి.. కన్నుబొమ్మలు కోల్పోయిన హీనా ఖాన్..
Hina Khan
Follow us on

బాలీవుడ్ బుల్లితెర నటి హినా ఖాన్ కొన్నాళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్ స్టే్జ్ 3తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఆసుపత్రి బెడ్ మీద నుంచి ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇదివరకే కిమోథేరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఇక ఇప్పుడు తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది హీనా ఖాన్. క్యాన్సర్‌తో పోరాడుతున్న హినా ఖాన్ ఇప్పుడు హృదయ విదారక ఫోటోను పంచుకుంది. తన కంటిలో మిగిలి ఉన్న చివరి కనురెప్పల చిత్రాన్ని పంచుకుంది హినా ఖాన్. ప్రస్తుతం తనకు ఈ కనురెప్పే అతిపెద్ద ప్రేరణ అని చెబుతోంది. “నా ప్రస్తుత మోటివేషన్ కారణం ఏమిటో మీకు తెలుసా? ఇదే. ఒకప్పుడు నా కళ్లకు కట్టిన శక్తివంతమైన, అందమైన సైన్యంలో భాగం నా కనురెప్పలు. నా వెంట్రుకలు సహజంగా పొడవుగా, అందంగా ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు క్యాన్సర్‌తో పోరాడుతూ నా కనురెప్పలు ఒంటరిగా ఉన్నాయి. నా చివరి కీమోథెరపీ చికిత్సలో భాగంగా నా కనురెప్పలు రాలిపోయాయి. నా వెంట్రుకలన్నీ రాలిపోయినప్పటికీ ఈ ఒక్క కనురెప్ప నాకు స్ఫూర్తినిస్తుంది. అంతా బాగానే ఉంటుంది, పదేళ్లుగా తప్పుడు కనురెప్పలు వేసుకున్న నేను వాటన్నింటిని ఎదుర్కొనే శక్తి నాకు కలగాలి. కానీ ఇప్పుడు నేను షూట్ కోసం కనురెప్పలు ధరించవలసి వచ్చింది” అంటూ హినా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతుంది హినా ఖాన్. ఇప్పుడు హీనా కేన్సర్ మూడో దశను దాటుతోంది. అంతకు ముందు హినా ఖాన్ తన అనారోగ్యం గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. కీమోథెరపీ ట్రీట్‌మెంట్ కారణంగా జుట్టు రాలడం ప్రారంభించిన తర్వాత హినా ఖాన్ తన జుట్టును కత్తిరించి విగ్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. క్యాన్సర్ చికిత్స సమయంలో కూడా ఇతరులకు ధైర్యాన్ని కలిగించేందుకు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది.

ప్రస్తుతం హినా ఖాన్ షేర్ చేసిన పోస్టుపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మీరు చాలా స్ట్రాంగ్.. మీరు వారియర్.. తొందరలోనే కోలుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందీలో అనేక సీరియల్స్ చేసిన హినా ఖాన్ తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.