
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా పరిచయమైన సినిమా ఫలక్‌నుమా దాస్. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. యాక్షన్ క్రైమ్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 2019లో విడుదలై ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ముందుగా నటుడు తిరువీర్ ను ఎంపిక చేసుకున్నారట విశ్వక్. కానీ అనివార్య కారణాల వల్ల కుదర్లేదట. ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భగవంతుడు సినిమా టీజర్ లాంచ్ వేడుకలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వక్ సేన్.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
2019 మేలో విడుదలైన ఫలక్‌నుమా దాస్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీతోనే నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో తిరువీర్ ప్రతినాయకుడిగా చేయాల్సి ఉందట. అయితే పలు కారణాలతో తిరువీర్ నటించడం కుదరలేదని వెల్లడించారు విశ్వక్ సేన్. బొమ్మల రామారం , మల్లేశం వంటి చిత్రాల్లో నటించిన తిరువీర్.. పలాస మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మసూద మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. మసూద మూవీ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నాడు తిరువీర్. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు.
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. జీజీ విహారి దర్శకత్వంలో తిరువీర్ నటించిన కొత్త సినిమా భగవంతుడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విశ్వక్ ముఖ్య అతిథిగా ఈ మూవీ వేడుకకు హాజరయ్యాడు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..