
గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది సినీ ప్రముఖలు సినీ అభిమానులు అందరూ పాల్గొని.. ఉగాది సంబరాలు జరుపుకనే సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున గద్దర్ ఫిలిం అవార్డస్ ఇవ్వటం.. మన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఓ కేంద్రంగా రాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ గారు అప్పట్లో తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి వాళ్లు తీవ్రమైన కృషి చేసి రామోజీరావుగారు ఫిలిం సిటీ నిర్మించి ఇక్కడే పరిశ్రమ చిరస్థాయిగా ఉండేలా చేశారు. ప్రభాకర్ రెడ్డిగారు తన సొంత స్థలాన్ని కార్మికుల కోసం దానం చేశారు. దాసరి గారు సినీ పరిశ్రమ పెద్దగా అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఇండస్ట్రీ ఇక్కడే ఉండేలా కృషి చేశారు.
ఈ రోజు ఇండియన్ మూవీస్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరబాద్‌ను తీర్చిదిద్దబోతున్నాం.. రెండో సంవత్సరం గద్దర్ అవార్డ్స్ కార్యకక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నాం.. నాగచైతన్య, రష్మిక లాంటి వాళ్లు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు.
వాళ్లను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన సీనియర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ఈ రోజు జపాన్, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి.. అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృథ్ధిని సినిమా పరంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా మార్చేందుకు సినిమాలను ప్రోత్సహించేందుకు సినిమాలను ఇక్కడ నిర్మించాలనుకుంటే సింగిల్ విండో పద్దతిలో అన్ని అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని అనుమతులు ఆన్‌లైన్ ద్వారానే తీసుకునేలా ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలని ఉప ముఖ్యమత్రి భట్టి విక్రమార్కగారికి సూచిస్తున్నా..
గద్దర్.. ప్రజాయుద్ధనౌక… సామాజిక రుగ్మతల మీద పోరాటం చేసిన వ్యక్తి. గద్దర్ గారిని తొలిసారి తెర మీద చూపించిన నిర్మాత కూడా ఇక్కడే ఉన్నారు. గద్దర్ ప్రభావం మొదటి తెలంగాణ ఉద్యమం, నక్సల్‌బరి ఉద్యమాల్లో గొంతుకగా నిలిబడ్డారు. గద్దర్ ఒక స్పూర్తి.. ఆయన స్పూర్తితోనే సామాజిక రుగ్మతల మీద పోరాటటం చేసేందుకు సినిమాను ఓ వెపన్ వాడాలని ఈ అవార్డ్స్ ఇస్తున్నాం. ఫిలిం ఇండస్ట్రీ సామాజిక సమస్య మీద పోరాటానికి తోడ్పడాలని మేం భావిస్తున్నాం..
హైదరాబాద్ సేఫెస్ట్ ఫ్లేస్ ఇన్ ద ఎర్త్ . దుబాయ్‌లో కాదు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయండి.. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కి మా ప్రభుత్వం అష్యూరెన్స్ ఇస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి