Vishwanath And Sons: వీకెండ్‌లో దుమ్మురేపిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. 2 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Vishwanath And Sons: వీకెండ్‌లో దుమ్మురేపిన విశ్వనాథ్ అండ్ సన్స్.. 2 రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Movie

Updated on: Aug 16, 2026 | 1:31 PM

సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా కమర్షియల్ హంగులు లేనప్పటికీ ఈ ఫీల్ గుడ్ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆగస్టు 14న రిలీజైన విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి రోజే రూ. 34 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక వీకెండ్ కావడంతో శనివారం (ఆగస్టు 15) ఈ మూవీ కలెక్షన్లు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లోనే సూర్య సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మొదటి రోజు సాధించిన వసూళ్ల కంటే రెండో రోజే కలెక్షన్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. అటు ఓవర్సీస్ లోనూ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూ. 31 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ మూవీ, యూఎస్ బాక్సాఫీస్ వద్ద అతి వేగంగా 1 మిలియన్ డాలర్ మార్కును దాటేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా చేసింది. అలాగే రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. మౌత్ టాక్ కూడా బాగుండడం సూర్య సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ఇక ఆదివారం కూడా సెలవు కావడంతో ఈ వీకెండ్ ముగిసే సరికి విశ్వనాథం అండ్ సన్స్ రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

కాగా కలెక్షన్లు బాగుండడంతో ఈ సినిమా ప్రమోషన్లు మరింత విస్తృతం చేస్తున్నారు మేకర్స్. వరుసగా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. శనివారం (ఆగస్టు 15) రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్ మీట్ కు తివ్రిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో సూర్య కూడా విచ్చేసి సినిమాను ఆదిరిస్తోన్న తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us