
టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ, తన కుమారుడు మహేష్ బాబు సినీ ప్రయాణం, కీలక నిర్ణయాలపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ తీసుకునే ఏ అడుగులోనైనా సాధారణంగా తాను పూర్తిగా మద్దతు ఇస్తానని, ఒక తండ్రిగా తాను విభేదించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయని కృష్ణ తెలిపారు. తాను విన్న సబ్జెక్ట్‌లు మహేష్‌కు విజయాలను అందించాయని ఆయన చెప్పారు. అయితే, నాని సినిమా సబ్జెక్ట్ తాను వినలేదని కృష్ణ వెల్లడించారు. ఒకవేళ విని ఉంటే, తాను తప్పకుండా ఆ సినిమాను వద్దనేవాడినని స్పష్టం చేశారు. “ఎందువల్ల వద్దనేవారు?” అని ప్రశ్నించగా, కృష్ణ తన కారణాలను వివరించారు. “చిన్న కుర్రాడు పెద్దవాడిగా కనబడటం, ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్‌తో అది సక్సెస్ అవ్వదు” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కథాంశం ఒక స్టార్ హీరోకు సరిపోదని, అది స్టార్ ఇమేజ్‌తో ప్రేక్షకులు ఆశించే అంశాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
నాని చిత్రం తమిళంలో విజయం సాధించిందనే వాదనపై కృష్ణ స్పందిస్తూ, తమిళంలో ఈ సినిమాను ఒక కొత్త వాళ్లతో ట్రై చేశారని, ఆ చిత్రానికి దర్శకుడే హీరోగా కూడా నటించారని వివరించారు. కొత్త నటుడితో ఇలాంటి ప్రయోగాత్మక కథలు విజయం సాధించవచ్చని, కానీ మహేష్ బాబు వంటి స్టార్ హీరో ఇమేజ్‌కు ఇది సరిపోయిన సబ్జెక్ట్ కాదని కృష్ణ స్పష్టం చేశారు. మహేష్‌కున్న ఇమేజ్, ఆయన స్టార్‌డమ్ దృష్ట్యా, ఇలాంటి పాత్రలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సూచించారు. తాను అసలు వినలేదని, వింటే మాత్రం కచ్చితంగా అభ్యంతరం చెప్పేవాని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
సినిమా విషయాలతో పాటు, కృష్ణ తమ కుటుంబ అనుబంధాలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. కుటుంబంతో గడిపే సమయాన్ని ఎలా ఆస్వాదిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, తన ఇంట్లో భోజనాలు వడ్డించే బాధ్యత తనదేనని సరదాగా చెప్పారు. అప్పుడప్పుడు తాను స్వయంగా వంట చేసి, పిల్లలందరినీ భోజనానికి పిలుస్తానని తెలిపారు. మహేష్, నమ్రత, మంజులతో సహా పిల్లలందరూ ఆనందంగా వస్తారని విజయనిర్మల పేర్కొన్నారు. తాను చేసే వంటకాల్లో, మహేష్‌కు పాయా అంటే చాలా ఇష్టమని కృష్ణ వెల్లడించారు. మహేష్ ప్రత్యేకంగా ఈ వంటకం కోసమే తన ఇంటికి వస్తాడని ఆయన ఆప్యాయంగా తెలిపారు. ఇక మంజుల నాన్-వెజ్ తినరు కాబట్టి, ఆమె కోసం ప్రత్యేకంగా టొమాటో రైస్ చేస్తానని చెప్పారు. పిల్లలందరూ ఖాళీగా ఉన్నారని తెలిసినప్పుడు, ఆ రోజు చూసుకొని అందరినీ భోజనానికి పిలుస్తానని, వారితో కలిసి గడిపే సమయం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని సూపర్ స్టార్ కృష్ణ తన కుటుంబ బంధాల గురించి ఎంతో ప్రేమగా మాట్లాడారు.
ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..