
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మరికొన్ని గంటల్లో సిగ్మా సినిమ్ రిలీజ్ ఉండనుండగా, హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తమన సినిమాపై నెగెటివ్ ప్రచార చేయడంపై సందీప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గత కొన్ని రోజులుగా నేను, నా కొత్త మూవీ లక్ష్యంగా పలువురు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్‌లు పెట్టడం చూస్తున్నా. దీని వెనుక ఎవరున్నా, డబ్బులిచ్చి ఇలా ఎందుకు చేయిస్తన్నారో నాకు బాగా తెలుసు. ఇది ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీకో విషయం గుర్తు చేస్తున్నా, ఇలా చేస్తూ ఉంటే నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు. డైరెక్టర్ వివరాలు బయట పెడితే అందరూ దొరికిపోతారు మరి.. చూసుకోండి మరి’ అంటూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు సందీప్ కిషన్.
కాగా ఇటీవల నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ ముందు కూడా ఇలాగే నెగటివ్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు మళ్లీ సిగ్మా సినిమా విషయంలో రిపీటయ్యింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సిగ్మా సినిమా విషయానికి వస్తే.. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్.వి.ఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందాన్ని అభినందించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజవుతోన్న సిగ్మాపై మంచి అంచనాలే ఉన్నాయి.
I see a lot of targeted anti Tweets coming at me & my film over the last few days lol
I know exactly the people behind this & paying for this as well…
Just reminding you that you have more to lose than me..
Direct ayipithe andaru dorikipitharu mari.. choosukondi :)— Sundeep Kishan (@sundeepkishan) October 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి