Bigg Boss 8: ఆ డైరెక్టర్ నన్ను ఇంటింకి రమ్మన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ సోనియా

|

Sep 10, 2024 | 11:27 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది సోనియా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది అర్జీవితో కలిసి కరోనా వైరస్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆశ ఎన్‌కౌంటర్ అనే సినిమా చేసింది.

Bigg Boss 8: ఆ డైరెక్టర్ నన్ను ఇంటింకి రమ్మన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ సోనియా
Sonia Akula
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8లో చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్‌లే ఉన్నారు. సినిమాల నుంచి వెళ్లిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సోనియా ఆకుల ఒకరు. ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది పాపులర్ అయ్యింది సోనియా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది అర్జీవితో కలిసి కరోనా వైరస్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆశ ఎన్‌కౌంటర్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా రామ్ గోపాల్‌నే వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొంది.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

ఇక బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా హౌస్‌లో దడదడలాడిస్తుంది. అంతే కాదు నిఖిల్ లో ప్రేమ వ్యవహారం కూడా మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు చాలా ఇంటర్యూలో పాల్గొంది. అలాగే ఈ అమ్మడు కరోనా సమయంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాంగోపాల్ వర్మ సినిమాల్లో నటించాలంటే చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారు అని తెలిపింది సోనియా.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

ఆర్జీవీ సినిమా అంటే చాలా మంది ఆలోచిస్తారు.. ఎందుకంటే ఆయన సినిమాలు బోల్డ్ గా ఉంటాయి. కరోనా వైరస్ సినిమా టైంలో ఆర్జీవీ ఇలా ఫ్యామిలీ తరహా చిత్రం చేస్తున్నారా.? అని ఆశ్చర్యపోయిందట సోనియా. ఆతర్వాత ఆమెను ఒక్కసారి ఇంటికి రమ్మన్నారట ఆర్జీవీ. దాంతో సోనియాకు చాలా డౌట్స్ మైండ్‌లో రన్ అయ్యాయట.. మోసం చేయడానికా, లేదా  అసభ్యంగా ప్రవర్తించడానికా అనే డౌట్స్ తనకు వచ్చాయని సోనియా తెలిపింది. కానీ తాను భయపడినట్లు ఏమీ జరగలేదని చెప్పి నవ్వేసింది సోనియా. ఇదంతా రామ్ గోపాల్ వర్మ ముందే సోనియా మాట్లాడింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు సోనియా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుండటంతో ఆమెకు సంబందించిన చాలా విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.