రీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సోనమ్ కోరిక తీరబోతోంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కూడా స్టార్ట్ కావటంతో రిజల్ట్ కోసం ఈగర్‌గా వెయిల్ చేస్తున్నారు ఈ స్టార్ కిడ్. 2019లో రిలీజ్ అయిన ది జోయా ఫ్యాక్టర్ సినిమా తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సోనమ్ కపూర్. పర్సనల్ లైఫ్‌కు టైమ్ ఇవ్వటం కోసం సినిమాలను పక్కన పెట్టేశారు. ఇప్పడు ఫ్యామిలీ లైఫ్ అంతా సెట్ అవ్వటంతో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. 2020లోనే ప్రారంభమైన రీమేక్ మూవీ బ్లైండ్ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోనమ్ చేస్తున్న ఈ మూవీని రెండేళ్ల క్రితమే తమిళ్‌లో రీమేక్ చేశారు. నయనతార లీడ్ రోల్‌లో నెట్రికన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలీవుడ్లోనూ బ్లైండ్ రీమేక్ ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు సోనమ్ కపూర్. బ్లైండ్ మూవీని థియెట్రికల్ రిలీజ్ కోసమే రెడీ చేసిన మేకర్స్ రిలీజ్ టైమ్‌కు ప్లాన్ మార్చేశారు. డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రజెంట్ నార్త్‌లో సక్సెస్ రేట్ అంతగా లేకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు మేకర్స్. డిజిటల్ రిలీజ్ విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చినా.. రిలీజ్ డేట్ లాక్ చేయడానికి కూడా చాలా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా జూలై 7న బ్లైండ్ డిజిటల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్‌కు కూడా ఫ్రీగా అందుబాటులోకి వస్తుండటంతో వ్యూస్ పరంగా మంచి నెంబర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.
(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)