
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాజిక సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటుందామె. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. కొన్ని సార్లు తన పోస్టులు, కామెంట్స్ పై ట్రోలింగ్ జరిగినా ఆమె వెనక్కితగ్గదు. ఇదే క్రమంలో కొందరు నెటిజన్లు పని గట్టుకుని చిన్మయిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా తిడుతున్నారు. అలా తాజాగా ఒక నెటిజన్ చిన్మయి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్ స్టీన్ కుంభ కోణం ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. ఇందులో ఎప్ స్టీన్ చేసిన ఉదంతాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఈ క్రమంలో చిన్మయి కూడా ఎప్ స్టీన్ స్కాండల్ ను గుర్తు చేస్తూ అందరినీ హెచ్చరించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఎప్ స్టీన్‌లు ఉంటారు. మత పెద్దలను కూడా గుడ్డిగా నమ్మకండి. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారు. మీకు తెలిసిన ఏ అమ్మాయినైనా అడగండి.. ఆమె మొదటిసారి ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైందో చెబుతుంది’ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది చిన్మయి.
చిన్మయి పోస్ట్‌పై స్పందించిన ఒక నెటిజన్ దారుణంగా కామెంట్స్ చేశాడు.. ‘నీ తండ్రే నిన్ను రేప్ చేసి ఉంటాడు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావు’ అంటూ చీప్ కామెంట్స్ పెట్టాడు. దీనిపై చిన్మయి కూడా ధీటుగా స్పందించింది. ‘నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు.. కానీ కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఊహిస్తున్నారంటే.. మీ సంస్కృతి ఏంటో, మీరు పెరిగిన వాతావరణం ఏంటో అర్థమవుతోంది. మిమ్మల్ని పెంచిన విధానం మీ బిహేవియర్ లో కనిపిస్తోంది’ అంటూ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు చిన్మయి శ్రీపాదకు మద్దతుగా నిలుస్తున్నారు.
No – Akula Reddy.
I wasn’t raped by my father.
But you definitely fantasise daughters getting raped by their fathers. And use that so commonly to a woman on Twitter
Shows what you are, your culture,
Your people, your society is and DEFINITELY SHOWS WHO RAISED YOU. pic.twitter.com/lBIr6agCdB— Chinmayi Sripaada (@Chinmayi) February 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.