Stree 2: శ్రద్ధకపూర్ హారర్ మూవీ స్త్రీ 2 మూవీ ఓటీటీ పార్ట్నర్ లాక్..

|

Aug 15, 2024 | 9:14 AM

ఇతర భాషల్లో తెరకెక్కిన సినిమాలు కూడా తెలుగులకి డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో రీసెంట్‌గా స్త్రీ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్త్రీ 2 సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది . గతంలో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది.

Stree 2: శ్రద్ధకపూర్ హారర్ మూవీ స్త్రీ 2 మూవీ ఓటీటీ పార్ట్నర్ లాక్..
Stree 2
Follow us on

హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా హారర్ సినిమాలు సక్సెస్ అయ్యాయి. అన్ని భాషల్లో హారర్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. ఇతర భాషల్లో తెరకెక్కిన సినిమాలు కూడా తెలుగులకి డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో రీసెంట్‌గా స్త్రీ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్త్రీ 2 సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది . గతంలో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు స్త్రీ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న అంటే ఈ రోజు థియేటర్స్ లోకి రానుంది.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

శ్రద్ధకపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కథ మధ్య ప్రదేశ్ లోని చందేరి గ్రామంలో కొనసాగుతూ ఉంటుంది. రూ.25కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పుడు స్త్రీ 2 సినిమా ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయినట్టు తెలుస్తోంది. థియేటర్ లో సినిమా రిలీజ్ కాక ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది స్త్రీ 2.

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

స్త్రీ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే బుకింగ్స్ లో ఈ సినిమా మంచి రికార్డ్ క్రియేట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..