
సంక్రాంతి పండక్కి నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శర్వానంద్. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైకర్’ (Biker). భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ట్రైలర్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. ఈసారి ఆయన ‘బైకర్’ సినిమాతో ఒక సరికొత్త స్పోర్ట్స్ డ్రామాను మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్ గమనిస్తే, ఇది కేవలం రేసింగ్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ జర్నీ అని అర్థమవుతోంది. మోటోక్రాస్ రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఒక యువకుడు ఎదుర్కొన్న సవాళ్లు, అతని పట్టుదల, ఆ క్రీడలో అతను సాధించిన విజయం చుట్టూ కథ తిరుగుతుంది. శర్వానంద్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక రకమైన పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు.
ట్రైలర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రేసింగ్ ట్రాక్ మీద చేసే స్టంట్స్, కెమెరా వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రేసింగ్ సీన్లకు కావాల్సిన ఎనర్జీని ఇచ్చింది. భారతదేశంలో మోటోక్రాస్ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. శర్వానంద్ ఒక పక్కా కమర్షియల్ , ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో మరో హిట్టు కొట్టేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ ప్రియులకు, కొత్త తరహా సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు ‘బైకర్’ ఒక విజువల్ ట్రీట్ కానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..
ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‌లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..