Kushboo: తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ.. పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

|

Aug 27, 2024 | 8:42 PM

ఇటీవల ఆమె నటించి నిర్మించిన అరణ్మనై 4 సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్బూ. కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టులో ఆమె మోకాలికి కట్టుతో కనిపించింది.

Kushboo: తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ.. పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
Kushbu Sundar
Follow us on

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ సుందర్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారామె. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారీ అందాల తార. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ స్పెషల్ రోల్స్ లో సందడి చేస్తున్నారు సీనియర్ హీరోయిన్. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అలాగే నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించి నిర్మించిన అరణ్మనై 4 సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్బూ. కాగా తాజాగా ఈ సీనియర్ నటి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టులో ఆమె మోకాలికి కట్టుతో కనిపించింది. అయితే అసలు ఏం జరిగింది? తనగాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు ఖుష్బూ. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారామె.

ప్రస్తుతం ఖుష్బూ సుందర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా బీజేపీ కీలక నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఖుష్బూ.

ఇవి కూడా చదవండి

మోకాలికి కట్టుతో ఖుష్బూ..

 

పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారనున్న ఖుష్బూ.. అందుకే కీలక పదవికి రాజీనామా

 

అయితే ఇటీవల ఆమె జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే స్టేట్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ గా మారేందుకే రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.