Archana: ‘ఆ మాటతో ఆలోచనలో పడ్డాను’.. చోర్ బజార్ సినిమాపై నటి అర్చన ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jun 22, 2022 | 3:31 PM

చోర్ బజార్ సినిమా కోసం డైరెక్టర్ జీవన్ రెడ్డి నన్ను సంప్రదించినప్పుడు నువ్వు చేసిన జార్జ్ రెడ్డి సినిమా బాగుంది. అయితే నాకు ఇప్పుడు సినిమాలు చేసే ఆసక్తి లేదని చెప్పా

Archana: ఆ మాటతో ఆలోచనలో పడ్డాను.. చోర్ బజార్ సినిమాపై నటి అర్చన ఆసక్తికర వ్యాఖ్యలు..
Archana
Follow us on

ప్రముఖ సీనియర్ నటి అర్చన (Archana) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మట్టి మనుషులు, చక్రవ్యూహం, పచ్చతోరణం, కోకిల వంటి చిత్రాలతో వెండితెరపై సందడి చేసింది అర్చన.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అర్చన.. దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత చోర్ బజార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు అకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటిస్తోన్న చిత్రం చోర్ బజార్.. ఈ చిత్రానికి డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇందులో కీలకపాత్రలో నటించిన జాతీయ ఉత్తమ నటి అర్చన మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అర్చన మాట్లాడుతూ.. ” చోర్ బజార్ సినిమా కోసం డైరెక్టర్ జీవన్ రెడ్డి నన్ను సంప్రదించినప్పుడు నువ్వు చేసిన జార్జ్ రెడ్డి సినిమా బాగుంది. అయితే నాకు ఇప్పుడు సినిమాలు చేసే ఆసక్తి లేదని చెప్పా. మీరు కనీసం రెండు సినిమాలైనా చేయాలని ఇటీవల యువ దర్శకులు కొందరు నాతో అన్నారు అది గుర్తొచ్చి. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నేను ఎవరికి తల్లి, ఎవరికి వదిన, ఎవరికి అత్త అని అడిగాను. మీరు ఎవరికీ ఏదీ కాదు, ఒక తల్లి, మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ఆ మాటతో ఆలోచనలో పడ్డాను. ఒక లైన్ చెప్పమంటే ఈ సినిమాలో మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఆయన్ను ప్రేమిస్తారు. ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతారు అన్నాడు. ఇంకేమీ చెప్పకు షూటింగ్ ఎప్పుడని అడిగా. నిజంగా తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. అలాగే అమితాబ్ కోసం ఒంటరిగా అలాగే ఉండిపోయినవారున్నారు. ఇది వాస్తవానికి
దగ్గరగా ఉన్న పాత్ర అనిపించింది.

అమితాబ్ బచ్చన్ అంటే ఆమెకు ఎంత ప్రేమంటే నిద్రపోయేప్పుడు కూడా మేకప్ వేసుకుని పడుకుంటుంది. కలలో అమితాబ్ వస్తే చూసి ఇష్టపడాలని. నాకు మేకప్ ఇష్టం లేదు కానీ ఈ క్యారెక్టర్ కోసం వేసుకున్నా. కథతో పాటు ఈ పాత్ర సాగుతుంటుంది. కొంత సస్పెన్స్ కూడా ఉంటుంది. హీరో పేరు బచ్చన్ సాబ్, మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. రెండు నిమిషాలు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.