Mohan Babu: వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్న మోహన్ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్షన్ కింగ్..

|

Apr 25, 2021 | 2:21 PM

గతేడాది కంటే.. ఈసారి కరోనా వైరస్ వేగం పుంజుకుంది. గత కొన్ని రోజులుగా తగ్గింది అనుకున్న వైరస్ మహమ్మారి

Mohan Babu: వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్న మోహన్ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్షన్ కింగ్..
Mohan Babu
Follow us on

గతేడాది కంటే.. ఈసారి కరోనా వైరస్ వేగం పుంజుకుంది. గత కొన్ని రోజులుగా తగ్గింది అనుకున్న వైరస్ మహమ్మారి మరోసారి తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో రోజుకు లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా నియంత్రణలో భారత ప్రభుత్వం విఫలమైందని.. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోకపోతే మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా కట్టడికి కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహరాష్ట్ర వంటి రాష్ట్రాలు మిని లాకౌ డౌన్ అమలు పరుస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తుండగా.. మరోవైపు రాష్ట్రాలు టీకా పంపిణీ వేగవంతం చేశాయి. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి భారిన పడి సామాన్యులు మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా మరణించారు. వ్యాక్సిన్ పట్ల అపోహాలు, భయాలు వ్యక్తం చేస్తూ.. చాలా మంది టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే సినీ సెలబ్రెటీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ.. సామాన్య ప్రజలు కూడా టీకా వినియోంచుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా రెండు డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు.

ఈ విషయాన్ని ఆయన స్యయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.మోహన్‌ బాబు ప్రస్తుతం సన్నాఫ్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: Siddipet Municipal Elections: మున్సిపల్ ఎన్నికల వైపు కన్నేత్తి చూడని కాంగ్రెస్ నేతలు.. ఆయోమయంలో ఆ పార్టీ అభ్యర్థులు..!

Telangana: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు.. ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి