Samyuktha Menon: స్టార్ హీరోతో భీమ్లానాయక్ బ్యూటీ గొడవ.. క్లారిటీ ఇచ్చిన సంయుక్త మీనన్

|

Jul 29, 2022 | 7:02 AM

షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్స్ మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం గురించి మనం వింటూ ఉంటాం.. చాలా సందర్భాల్లో హీరో లతో గొడవలు పడి కొంతమంది హీరోయిన్లు సినిమాలను కూడా వదులుకున్న హీరోయిన్స్ ఉన్నారు.

Samyuktha Menon: స్టార్ హీరోతో భీమ్లానాయక్ బ్యూటీ గొడవ.. క్లారిటీ ఇచ్చిన సంయుక్త మీనన్
Samyuktha Menon
Follow us on

షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్స్ మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం గురించి మనం వింటూ ఉంటాం.. చాలా సందర్భాల్లో హీరో లతో గొడవలు పడి కొంతమంది హీరోయిన్లు సినిమాలను కూడా వదులుకున్న హీరోయిన్స్ ఉన్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా షూటింగ్ సమయంలో హీరోతో గొడవపడిందని ఈ మధ్య వార్తలు పుట్టుకొచ్చాయి. స్టార్ హీరో తో విభేదాలు అంటూ వార్తలు రావడంతో ఈ చిన్నదాని పై ట్రోల్స్ కూడా జరిగాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు సంయుక్తమీనన్(Samyuktha Menon). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ఈ చిన్నది భీమ్లానాయక్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తోన్న బింబిసార సినిమాలో నటిస్తోంది సంయుక్త మీనన్.

అలాగే ఈ అమ్మడు ధనుష్ నటిస్తోన్న సార్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. అయితే సార్ సినిమా షూటింగ్ లోనే భాగంగా సంయుక్త మీనన్ కు హీరో ధనుష్ కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని టాక్ వినిపించింది. వెంకీ ఆతులు దర్శకత్వం వహిస్తున్న సార్ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అయితే షూటింగ్ మొదలైన రెండు రోజులకే సంయుక్తకు ధనుష్ కు మధ్యలో గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. సార్ సినిమాకు నేను 17 రోజులు షెడ్యూల్ ఇచ్చాను.. ఇంకా ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్నా అన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది సంయుక్త ఆ సినిమాలో నటించడం లేదని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి