సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన స్నేహితులతో విదేశాలకు చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి ఛార్ దమ్ యాత్ర చేసిన సామ్.. ప్రస్తుతం దుబాయ్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్లో ఉంటుంది. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా సామ్ తన ఇన్స్టాలో ఆసక్తికర మెసేజ్స్ షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పనిలో పనిగా తన బెడ్రూం పరిస్థితి ఎలా ఉంటుందో వివరించింది.
తన బెడ్రూం చిందరవందరగా.. ఉంటే.. చాలా నీట్గా చేశారంటూ ఓ కంపెనీ గురించి ప్రమోషన్ ఇచ్చింది సామ్. అంతేకాకుండా.. తనకు ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయిన… డిప్రెషన్ లా అనిపించినా కూడా బట్టలన్నీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సామ్ తన బెడ్రూంను సైతం చూపించింది. అక్కడ బెడ్ పై తన బట్టలన్ని కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి. అక్కడే తన స్నేహితులతో సామ్ కూర్చుని కబుర్లు చెబుతూ కనిపించింది. కొన్నిసార్లు సర్దడం… కలపడం కంటే వదిలేయడం బెటర్ అంటూ చెప్పుకొచ్చింది సామ్.
ఇటీవల తన ఇన్ స్టా స్టోరీలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది సామ్. ప్రముఖ రైటర్ రాబర్ట్ (Robert McKee) కోట్స్ పోస్ట్ చేసింది సమంత. “ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి. ఎక్కువ ఒత్తిడికి గురయిన.. మనం లోతుగా.. మన స్వభావం అసలైనది సెలక్ట్ చేసుకుంటుంది.” అంటూ పోస్ట్ చేసింది.
Also Read: Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..
భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..