AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిఫరెన్స్ ఉంది..’అర్జున్ రెడ్డి’ మూవీపై వెబ్‌సైట్‌కు ‘ఓ బేబీ’ క్లాస్

‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్‌లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమాలోన హీరో, హీరోయిన్‌ని చెంప దెబ్బలు కొట్టడంపై ఓ రివ్యూ రైటర్ ఘాటుగా విమర్శలు చేశారు. వీటిపై దర్శకుడు సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో […]

డిఫరెన్స్ ఉంది..'అర్జున్ రెడ్డి' మూవీపై  వెబ్‌సైట్‌కు 'ఓ బేబీ' క్లాస్
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2019 | 3:54 PM

Share

‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్‌లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించాడు.

అయితే, ఈ సినిమాలోన హీరో, హీరోయిన్‌ని చెంప దెబ్బలు కొట్టడంపై ఓ రివ్యూ రైటర్ ఘాటుగా విమర్శలు చేశారు. వీటిపై దర్శకుడు సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘ఒకరిని ఒకరు చెంపపై కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని నేను అనుకోను’ అని  అన్నారు.

సందీప్ రెడ్డి చేసిన కామెంట్లపై సమంత అసహనం వ్యక్తం చేసింది. ఆ కామెంట్లపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డీప్లీ డిస్టర్బింగ్’ అని ఫోస్ట్ చేసింది.

సమంత చేసిన ఈ కామెంట్‌ను పట్టుకుని ఓ వెబ్‌సైట్ సమంతవి ‘డబుల్ స్టాండర్డ్స్’ అంటూ ట్వీట్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు మూవీ తనకు నచ్చిందంటూ సమంత చేసిన ట్వీట్ ను, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇమేజ్‌ను కలిపి ట్వీట్ చేసింది.

అయితే, ఈ ట్వీట్‌పై సమంత సదరు వెబ్‌సైట్‌కు కాస్త గట్టిగానే క్లాస్ పీకింది… ‘సినిమాను ఇష్టపడటం, ఒకరి కామెంట్‌తో ఏకీభవించకపోవడం రెండు వేర్వేరు విషయాలు. ‘అర్జున్ రెడ్డి’ కథ నాకు నచ్చింది. కానీ ప్రేమ అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ల చెంపలు పగలగొట్టే స్వేచ్ఛ అని చెప్పడం నాకు నచ్చలేదు’ అని  ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్‌పై భారీగా చర్చ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ కొన్ని వెబ్‌సైట్లు, సమంతకు మద్దతుగా మరికొన్ని వెబ్‌సైట్లు..సోషల్ మీడియా వేదికగా వార్‌కు తెరతీశాయి.

Follow Us
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్