S. J. Suryah: ఆ ఇద్దరిలో తేడా అదే.. పవన్- మహేష్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎస్.జె. సూర్య

|

Nov 25, 2021 | 5:08 PM

దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్ జే సూర్య ఆతర్వాత నటుడిగా మరి సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

S. J. Suryah: ఆ ఇద్దరిలో తేడా అదే.. పవన్- మహేష్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎస్.జె. సూర్య
Sj Suryah
Follow us on

S. J. Suryah: దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్.జె. సూర్య ఆ తర్వాత నటుడిగా మరి సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూర్య ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే మహేష్ బాబూతో నాని సినిమా చేశారు. ఆతర్వాత మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో విలన్ గా నటించి భయపెట్టారు ఎస్.జె. సూర్య. తాజాగా సూర్య నటించిన తమిళ్ సినిమా ‘మానాడు’ తెలుగులో ది లూప్ పేరుతో విడుదలైంది. ఈ సందర్భంగా సూర్య ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ పవన్ -మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన వారిద్దరిలో తేడా ఏంటో చెప్పుకొచ్చారు.

దర్శకుడిగా నేను పవన్ కల్యాణ్ తో ‘ఖుషీ’ .. మహేశ్ తో ‘నాని’ సినిమాలు చేశాను. ఆ సమయంలో వారిని చాలా దగ్గరగా చూసాను. పవన్ కళ్యాణ్ దేవుడు చేసిన సింగిల్ పీస్.. ఆయన తన మనసుకు నచ్చింది వెంటనే చేసేస్తాడు. ఏది ఉన్న నిర్మొహమాటంగా చెప్పేస్తారు. సినిమా చేస్తా అంటే చేస్తానని లేదంటే చేయను అని చెప్పేస్తారు. పవన్ ఏదైనా అనుకుంటే వెంటనే అది జరిగిపోవాలి. ఇక మహేష్ విషయానికొస్తే ఆయన చాలా కూల్. మహేష్ తన మనసుకు నచ్చిన పని చేయాలంటే కొంత ఆలోచిస్తారు. ఇదే నేను ఆ ఇద్దరిలో కనుకుంది అని చెప్పుకొచ్చారు సూర్య. అలాగే ఈ ఇద్దరి స్వభావాన్ని బట్టి పవన్‌‌ను అజిత్ తో.. మహేష్‌ను దళపతి విజయ్ తోపోల్చుతాను. ఎందుకంటే ఈ నలుగురితో నేను కలిసి పనిచేశాను అని అన్నారు ఎస్.జె. సూర్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..