RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు.. గొడవకు దిగిన ఎన్టీఆర్‌, చెర్రీ ఫ్యాన్స్‌..

| Edited By: Ravi Kiran

Mar 25, 2022 | 10:00 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కోసం తెలుగు సినీ ప్రియులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లపై వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు.. గొడవకు దిగిన ఎన్టీఆర్‌, చెర్రీ ఫ్యాన్స్‌..
Rrr
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కోసం తెలుగు సినీ ప్రియులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR. NTR) హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌, అజయ్ దేవగణ్, శ్రియా శరన్.. సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. రిలీజ్​కు ముందే​రికార్డులను తిరగేస్తున్న ఈ సినిమాను ఫస్ట్‌ షోలోనే చూడాలని ఫ్యాన్స్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక థియేటర్ల వద్ద హీరోల కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల మధ్య సినిమా టికెట్లకు సంబంధించి గొడవ రాజుకుంది.

వివరాల్లోకి వెళితే.. కుప్పంలో మూడు థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ మేరకు బెనిఫిట్ షోలకు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో 3 వేల టికెట్లు అభిమానులు సిద్ధం చేశారు. అయితే ఈ టికెట్లపై కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండడంతో అభిమానులు కోపోద్రిక్తలయ్యారు. దీంతో కుప్పం బీసీయన్ సినీ కాంప్లెక్స్ వద్ద మెగా అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఒక్కటిగా కాకుండా వేరు వేరుగా థియేటర్లను పంచుకున్నారు. ఆ థియేటర్లలోనే సినిమాలు చూడాలని నిర్ణయించుకున్నారు.

Also Read:Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజు మింగేస్తున్న తామర పురుగు

Mekedatu project: కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ కాక.. మెకెదాతు డ్యామ్‌పై హాట్ హాట్ రచ్చ..

Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి