RRR Update : అలిసన్ డూడీ వచ్చేస్తుంది !

|

Nov 01, 2020 | 7:32 PM

రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ... ఈ ముగ్గురు అంతర్జాతీయ నటీనటులు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నట్లు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

RRR Update : అలిసన్ డూడీ వచ్చేస్తుంది !
Follow us on

రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ… ఈ ముగ్గురు అంతర్జాతీయ నటీనటులు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నట్లు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్‌లో జాయిన్ అవ్వడానికి అలిసన్ డూడీ ఐర్లాండ్ నుంచి భారత్‌కు వస్తున్నారు. ఈమె ఆర్.ఆర్.ఆర్‌లో ప్రధానమైన లేడీ స్కాట్ పాత్రలో నటిస్తున్నారు. మోడల్ నుంచి నటిగా మారిన ఈ 53 ఏళ్ల ఐరిష్ భామ పలు హాలీవుడ్ సినిమాల్లో, టీవీ సిరీసుల్లో నటించారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు విప్లవకారులు బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించినవారే. అందుకే, ఈ సినిమాలో మెయిన్ విలన్ కూడా బ్రిటిష్ అధికారే ఉంటారు. అందుకని, విలన్‌గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను తీసుకున్నారు. ‘థార్’ సినిమాలో ఈయన చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో ఈయన ప్రధాన విలన్ స్కాట్‌గా కనిపించనున్నారు. కథ ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ ఒక బ్రిటిష్ అమ్మాయితో లవ్‌లో పడతారు. అందుకని ఈ పాత్ర కోసం లండన్‌కు చెందిన ఒలివియా మోరిస్‌ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Also Read  :

అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !

వకీల్ సాబ్ సెట్‌లో పవన్.. ఫోటో లీక్