‘ఆర్ఆర్ఆర్’లో తెలుగమ్మాయి.?

|

Nov 01, 2020 | 8:28 PM

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర

ఆర్ఆర్ఆర్లో తెలుగమ్మాయి.?
Follow us on

RRR Movie: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. మొదటి హీరోయిన్‌గా విదేశీ భామను ఫైనల్ చేసిన జక్కన్న.. మరో హీరోయిన్‌గా తెలుగమ్మాయిని ఖరారు చేసినట్లు వినికిడి.

కౌసల్య కృష్ణముర్తి, నవాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. తారక్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది.