అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి హీరోయిన్ మధుబాల. 90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన కథానాయిక. 1991లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్ చిత్రంతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధు.. ఆ తర్వాత రోజా సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
Madhubala

Updated on: Jun 21, 2026 | 12:33 PM

సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందాల తార ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ తర్వాత చెప్పే పేరు మధుబాల. ఆమె అందానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఆమె రూపం, ఆమె అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు మధుబాల. 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించారు మధుబాల. 1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన  ఈ అందాల తార.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. రోజా సినిమాలో తన క్యూట్ యాక్టింగ్, అందంతో ఆడియెన్స్ హృదయాలకు కొల్లగొట్టింది. ఈ సినిమాలో ఆమె అమాయకపు మహిళగా నటించి ఆకట్టుకుంది. కుర్రకారు అయితే ఆమెకు అందాల దేవతగా ఆరాదించారు.

తెలుగు, హిందీ , తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించారు మధుబాల. ఈ అందాల తార ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు. ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది.ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది. ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలోకి వచ్చారు మధు. ఇక  తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, గణష్, చిలక్కొట్టుడు మూవీస్‌లో యాక్ట్ చేసింది. కాగా హేమా మాలిని, జుహీ చావ్లాలకు బంధువు అయిన ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న మ్యారేజ్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కపుల్‌కు అమెయా, కెయా అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. పెళ్లి తర్వాత.. ఇండస్ట్రీకి కొంత బ్రేక్ ఇచ్చిన మధుబాల.. సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ వెండితెరపైకి వచ్చారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఆమె నటించి మెప్పించారు. అంతకు ముందు చేసిన నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య సినిమాలో హీరో తల్లిగా నటించింది. తర్వాత  తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. శాకుంతలం, ప్రేమదేశం, ఈగల్ సినిమాల్లో కీ రోల్స్ చేశారు. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్పలోనూ కీలక పాత్ర చేశారు. కాగా మధుబాల కూతుర్లు ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. మధుబాల కూతుర్లు ఎంతో అందంగా ఉన్నారు. అచ్చం అమ్మ అందమే వారికీ వచ్చింది. మధుభాల ఎప్పుడైనా తన కుమార్తెలు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే అవి వైరల్ అవతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us