AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

'టాక్సిక్' సినిమా గురించి ఒక పెద్ద అప్‌డేట్ ఇస్తానని శనివారం (జూన్ 20) హీరో యశ్ ఒక పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే తన అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పాడు రాఖీ భాయ్. ఈ మేరకు టాక్సిక్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ పంచుకున్నాడు యశ్.

Toxic Movie: వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Toxic Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 12:50 PM

Share

యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘టాక్సిక్ ‘ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది . చివరకు , ఈ ఏడాది ఆగస్టు 26న ‘టాక్సిక్’ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా యష్‌కు ‘టాక్సిక్’ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత అతను అంగీకరించిన చిత్రం ఇదే. అందుకే ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. పెద్ద విదేశీ కంపెనీలు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. యష్ ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమా గురించి హైప్ పెంచుతున్నాడు.

ఇవి కూడా చదవండి

అనుకున్నదంతా జరిగి ఉంటే, ‘టాక్సిక్’ సినిమా ఇప్పటికి విడుదలై ఉండాలి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడింది. మొదటిసారి యుద్ధం కారణంగా ‘టాక్సిక్’ విడుదల తేదీ వాయిదా పడింది. ఇక రెండోసారి, సినిమా మార్కెట్‌ను విస్తరించడం కోసం విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక ‘టాక్సిక్’ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు సంచలనం సృష్టించాయి. అలాగే వివాదాలకు కూడా కారణమయ్యాయి.  అలాగే ఇలాంటి ఊర మాస్ చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు కూడా సమర్థంగా హ్యాండిల్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్ర కథా రచనలో యష్ కూడా పాలుపంచుకున్నారు.

హీరో యశ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే