సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు అని అన్నారు రాఘవేంద్రరావు. అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా..
– తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి అన్నారు రాఘవేంద్రరావు. అలాగే గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారు.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం అని రాఘవేంద్రరావు అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..
సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ మాట్లాడుతూ.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్.
అలాగే మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం అన్నారు. అదేవిధంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్.. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి అని సురేష్‌బాబు తెలిపారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని అన్నారు. ఇక ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్నారు.